ఇంటర్వ్యూ : శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర నిర్మాతలు విజయ్ చల్లా, శశి

ఇంటర్వ్యూ : శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర నిర్మాతలు విజయ్ చల్లా, శశి

Published on Aug 24, 2021 5:00 PM IST

మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తీర్చుకున్నందున ప్రతీ వారం కూడా ఓ హిట్ సినిమా విడుదల అవుతూ వస్తుంది. మరి అలా మంచి పాజిటివ్ బజ్ ఉన్న చిత్రంగా సుధీర్ బాబు హీరోగా నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ వారంలో విడుదలకు సన్నద్ధం అయిన ఈ చిత్రంపై మరిన్ని విషయాలు పంచుకోడానికి నిర్మాతలు విజయ్ చల్లా, శశిలు ముందుకొచ్చారు. మరి వారు ఎలాంటి విషయాలు తెలిపారో చూద్దాం రండి.

చెప్పండి, ఈ సినిమాకి చాలానే అవాంతరాలు వచ్చాయట నిజమేనా?

అవును సినిమా మొదటి రోజు షూట్ స్టార్ట్ చేసిన రోజునే మెయిన్ కెమెరా కింద పడిపోయింది దీనితో అందరికీ గుండె ఆగినట్టు అయ్యిపోయింది ఫస్ట్ రోజే ఇలా అయ్యింది ఏంటా అనుకున్నాం సరే తర్వాత ముందే అనుకున్న టైం షూట్ కంప్లీట్ చేసాం అనుకుంటే కార్వాన్ దగ్గర ఓ అసిస్టెంట్ కి కరెంట్ షాక్ కొట్టింది. మళ్ళీ ఇలా అయ్యిందా ఏంటా అనుకున్నాం ఆ నెక్స్ట్ డే నే మళ్ళీ ఇంకో కార్వాన్ గొయ్యిలో ఇరుక్కుంది. ఇలా చాలానే సంఘటనలు జరగడంతో ఏంటా అనుకున్నాం, మధ్యలో మా అన్నయ్య చనిపోవడం ఇంకా బాధాకరమైన ఘటన. అప్పుడు నెలరోజులు బ్రేక్ తీసుకున్నాం. కానీ మళ్ళీ అందరం కూర్చొని ఓసారి మాట్లాడుకొని స్టార్ట్ చేసాం అపుడు నుంచి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా షూట్ కంప్లీట్ చేసేసాం.

సినిమాకి టైటిల్ ఫస్ట్ నుంచి ఇదేనా మీ రియాక్షన్ ఏమిటి?

ముందు నుంచి ఇదే అనుకున్నాం కానీ దానికి ముందు నల్ల వంతెన అనేది కూడా అనుకున్నాం. అయితే ఇది లవ్ స్టోరీ కూడా ఉంది కనుక అందరికీ ఆ టైటిల్ తో కనెక్ట్ అవుతుందా లేదా అని మళ్ళీ ఇది పెట్టాం. రెండో ఆప్షన్ గా శ్రీదేవి సోడా సెంటర్ అని పెట్టాం. సినిమా కోర్ లైన్ అంతా కూడా దీని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా ఈ టైటిల్ ని ఓకే చేసేసాం.

మరి ఈ సినిమానే చెయ్యడానికి కారణం ఏమిటి?

ప్రతి సినిమా చెయ్యడానికి కూడా ఒకటే కారణం ఉంటుంది, అదే కథ. ఆనందో బ్రహ్మ చేసిన తర్వాత చాలానే హారర్ కామెడీ కథలు వచ్చాయి కానీ చెయ్యలేదు. అప్పుడు యాత్ర వచ్చింది డిఫరెంట్ జానర్ అనిపించింది కాబట్టే అది చేసాం. అలా దాని తర్వాత ఇది కూడ మంచి కథ వేరే జానర్ కాబట్టి దీనిని టేకప్ చేసాం.

మీ సినిమాలకు మరి గ్యాప్ ఎక్కువ వస్తున్నట్టే ఉందిగా?

గ్యాప్ అంటే తప్పట్లేదు మాకు, మంచి కథ వస్తే ఖచ్చితంగా చేస్తాం మంచి కథలు రావట్లేదు. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు 7 సినిమాలే చేశారు కానీ ఆయన కోసం ఇంకా మాట్లాడుకుంటున్నాం అలా టైం తీసుకున్నా కూడా మంచి క్వాలిటీ ఉన్న సినిమానే ఇవ్వాలన్నది మా లక్ష్యం.

‘పలాస’ టైప్ లో ఇది కూడా రా సబ్జెక్టు లా ఉంటుందా?

పలాస టైప్ లో అని కాదు కానీ ఇందులో అంతా రియల్ గా అనిపిస్తుంది. అమలాపురం సైడ్ చూసుకుంటే అలాంటి అమ్మాయి, అబ్బాయి వాళ్ళ నాన్నలు లాంటి వారు కూడా కనపడతారు. అలా రియలిస్టిక్ గా ఉంటుంది.

కుల వివక్షత తరహాలో చాలా సినిమాలు వచ్చాయి ఇది దానికి ఎలా డిఫరెంట్ గా ఉంటుంది.?

ఇందులో కేవలం కుల వివక్షత అనేది ఎక్కడా ఉండదు. నిజానికి ఒక లవ్ స్టోరీ దాని చుట్టూతా వచ్చే విలేజ్ పాలిటిక్స్, కాస్ట్ వంటి పాయింట్స్ మాత్రం కనిపిస్తాయి. అంతే కానీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది మెయిన్ పాయింట్ కాదు.

మ్యూజిక్ కి మణిశర్మ గారిని ఎంచుకోవడం మీ ఛాయిసేనా?

అవును మణిశర్మ గారిని తీసుకోవాలని నేనే అనుకున్నాను. ఎందుకంటే ఒక తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అయితేనే రూరల్ బ్యాక్ డ్రాప్ ఎమోషన్స్ ని మ్యూజిక్ తో హైలైట్ గా ఇవ్వగలరు అందులోని మణిశర్మ గారు అయితేనే కరెక్ట్ అని ఆయన్ను మా ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్ గా తీసుకోవడం జరిగింది.

మరి సుధీర్ బాబుతో మీ బాండింగ్ కోసం చెప్పండి?

వర్క్ విషయానికి వస్తే తాను హీరో నేను ప్రొడ్యూసర్ గానే ఉంటాం. కానీ అది పక్కన పెడితే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. రెండు వేరు వేరు గానే ఉంటాయి..

రెండో వేవ్ తర్వాత మరో పెద్ద రిలీజ్ దీనిపై ఏం చెప్తారు?

అవును ఇప్పటికే థియేటర్స్ లిస్ట్ కూడా వచ్చేసింది ఇంకా కొన్ని యాడ్ కూడా అవుతున్నాయి. సెన్సార్ కూడా ఒక్క కట్ లేకుండా పూర్తయ్యింది. చూసాక ఎందుకు లేవా అన్నది కూడా ప్రతి ఒక్కరికీ అర్ధం అవుతుంది.

యాత్ర తర్వాత వై ఎస్ జగన్ గారి బయోపిక్ తీస్తున్నారంట నిజమా?

లేదు అలాంటిది ఇంకా ఏం అనుకోలేదు మా బ్యానర్ నుంచి ఇంకా అలాంటివి ఏమి లేవు ప్రస్తుతానికి శ్రీదేవి సోఫైనల్ గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?డా సెంటర్ రిలీజ్ తోనే బిజీగా ఉన్నాం.

మరి స్టార్ హీరోస్ తో భారీ సినిమాలు ఏమన్నా ప్లానింగ్ ఉన్నాయా?

ఏదైనా సరే కథ పైనే ఆధారపడి ఉంది. ఎవరైనా మా దగ్గరకి వస్తే దానికి తగ్గ హీరో ఎవరు ఎంతలో చెయ్యాలి అన్నవి అన్ని చూసుకొని తప్పకుండా చేస్తాం అందులో ఎలాంటి అనుమానం లేదు.

ప్రస్తుతానికి అయితే శ్రీదేవి సోడా సెంటర్ రిలీజ్ నే ఉంది. చాలా కథలు వింటున్నాం, ఆల్రెడీ ఒక స్టోరీ ఎగ్జైటింగ్ గా నడుస్తుంది. అది మమ్మల్ని ఎక్కడ వరకు తీసుకెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు