ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: పావని గంగిరెడ్డి- లూజర్ నా కష్టానికి గుర్తింపు తెచ్చింది.

Published on May 21, 2020 5:58 pm IST

సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా కెరీర్ ప్రారంభించి నటిగా మారిన పావని గంగి రెడ్డి ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న లూజర్ వెబ్ సిరీస్ లో మంచి పాత్ర చేశారు. ఆమె నుండి ఇంటర్వ్యూ ద్వారా అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకోవడం జరిగింది అవి మీకోసం..

 

లూజర్ వెబ్ సిరీస్ కి వస్తున్న స్పందన ఎలా ఉంది?

లూజర్ కి ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన అద్భుతం అని చెప్పాలి. అందరూ దీని గురించి మాట్లాడుకుంటుంటే పడ్డ కష్టం అంతా మరిచిపోతున్నాం.

వ్యక్తిగతంగా మీకు దక్కుతున్న ప్రశంశలు ఏమిటీ?

నేను చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. అద్భుతమైన స్పందన మా ఫ్యామిలీ మెంబర్స్ కి మంచి అనుభూతిని ఇస్తుంది. కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఫీలవుతుంటే గాల్లో తేలుతున్న భావన కలుగుతుంది.

ఈ పాత్రలో మీరు ఇబ్బందిపడిన సన్నివేశం ఏమిటీ?
నా మొదటి సన్నివేశమే భార్యగా ఓ రొమాంటిక్ సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. ఐతే డైరెక్టర్ హెల్ప్ తో ఆ సన్నివేశం విజయవంతంగా ముగించగలిగాను.

మొదటి నుండి నటి కావాలన్నది మీ కోరికా?
లేదు.. నేను ఇన్ఫోసిస్ ఉద్యోగిని. ఓ షార్ట్ ఫిల్మ్ చేయడంతో దాని ద్వారా నిత్యా మీనన్, శర్వానంద్ నటించిన మళ్ళీ మళ్ళి ఇది రానిరోజు మూవీలో ఓ పాత్ర చేసే అవకాశం దక్కింది. అలా సినిమాలలోకి ఎంటర్ అయ్యాను.

ఇప్పుడు మూవీ అనేది మీకు ఫుల్ టైం ప్యాషన్ గా మారిందా?

లేదు. నాకు సినిమా అనేది హాబీ మాత్రమే. మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సినిమా తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే పాత్రలు నాకు నచ్చకపోవడంతో నేను చేయలేదు. నిజం చెప్పాలంటే సినిమా కంటే నా జాబ్ నే ఎక్కువగా ప్రేమిస్తాను.

లూజర్ లో అవకాశం ఎలా వచ్చింది?

అభిలాష్ తో గతంలో నేను పని చేశాను. దానితో పల్లవి పాత్ర కోసం ఆయన నన్ను సంప్రదించారు. ఐతే మొదట నా పాత్రలో కిస్సింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో తిరస్కరించాను. నా కోసం అభిలాష్ కొన్ని మార్పులు చేయడంతో ఒప్పుకున్నాను.

మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ?

మాది ప్రకాశం జిల్లా, 14ఏళ్ల వయసులో హైదరాబాద్ కి షిఫ్ట్ కావడం జరిగింది. మా హస్బెండ్ కన్స్ట్రక్షన్ రంగంలో జాబ్ చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు. నా సక్సెస్ లో ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?
కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను. లాక్ డౌన్ అనంతరం సినిమాలా లేక సిరీస్ లా అనే దానిపై స్పష్టత వస్తుంది. లూజర్ వలన నా కష్టానికి గుర్తింపు వచ్చింది. అది నాకు చాలా సంతోషం కలిగించే అంశం.

సంబంధిత సమాచారం :

More