ఇంటర్వ్యూ : శ్రీనివాస్ – నిర్మాణంకంటే ప్రచారమే చాలా సులభం

ఇంటర్వ్యూ : శ్రీనివాస్ – నిర్మాణంకంటే ప్రచారమే చాలా సులభం

Published on Mar 1, 2014 7:18 PM IST

srinivas
శ్రేయాస్ మీడియా సంస్థ క్రమం తప్పకుండా మనల్ని తమ సినిమాలద్వారా ఎంటర్టైన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో పిజ్జా సినిమా తరువాత వారు మరోసారి భద్రమ్ అనే థ్రిల్లర్ తో మనముందుకు రానున్నారు. ఈ సినిమా నిర్మాత శ్రీనివాస్ ఈరోజు ప్రెస్ తో చిత్ర విశేషాలు పంచుకున్నారు. అవేమిటో చూద్దామా..

ప్ర) భద్రమ్ సినిమా విశేషాలు చెప్పండి ?
స) తమిళం లో సూపర్ హిట్ అయిన ‘తెగిడి’ సినిమాకు రిమేక్ ఈ భద్రమ్. నిన్న తమిళ్ లో ఈ మర్డర్ మిస్టరీ విడుదలైంది. ఆ టాక్ చూసినవెంటనే మేము ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చూపించాలని అనుకున్నాము

ప్ర) ఈ సినిమాకు భద్రమ్ అనే పేరునే ఎందుకు పెట్టారు?
స) ముందే చెప్పినట్టుగా ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ. సినిమాలో చాలా మంది చంపబాడతారు. ఎవరు దీనికి కారణం అన్న విషయం చివరివరకూ దాచిపెట్టాం. అందుకే ఈ సినిమాకు భద్రమ్ అనే టైటిల్ ను అనుకున్నాం

ప్ర) ఈ సినిమా ఎప్పుడు విడుదలకానుంది?
స) ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను మార్చ్ మొదటి రెండు వారాలలో తెరపైకి తీసుకొస్తాం

ప్ర) ఈ సినిమాలో ప్రధాన తారాగణం వివరాలు చెప్పగలరా?
స) అశోక్ మరియు జనని ఈ సినిమాలో ప్రధానపాత్రలు పోషించారు. అశోక్ విల్లా సినిమాలో నటించగా జనని ఇప్పటికే 16సినిమాలలో నటించింది. ఈమె గతంలో బాలా తీసిన వాడు వీడు సినిమాలో విశాల్ సరసన నటించింది

ప్ర) మీ బ్యానర్ పై ఇంకేం సినిమాలు రానున్నాయి?
స) మేము ఇప్పటికే ‘ఎస్’ అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం,  రవిబాబు శిష్యుడు వెంకటరత్నంతో మరో సినిమా అనుకున్నాం.

ప్ర) ఈ రెండిటిలో ఏది కష్టం, సినిమా నిర్మాణమా?? లేక ప్రచారమా?
స) నిజానికి ప్రచారమే నిర్మాణం కంటే తేలిక. ఉదాహరణకు ఈరోజుల్లో సినిమాను 45లక్షలలో తీసేసాం. కానీ ఆ సినిమాకు 75 లక్షలు ఖర్చుపెట్టి ప్రచారం చేసాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు