ఇంటర్వ్యూ : కార్తీ : ‘సుల్తాన్’ సినిమా థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ కోసమే చేశాం

Published on Mar 30, 2021 7:37 pm IST

 

‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చేసిన కార్తీ ‘సుల్తాన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

 

ఈ క‌థ‌లో మిమ్మ‌ల్ని ఎగ్జైట్ చేసిన ?

ఇంట్లో ఒక్క అన్న‌య్య ఉంటేనే గొడ‌వ‌లు వ‌స్తాయి. అలాంటిది వంద‌మంది అన్న‌య్య‌లు ఉంటే ఏం జ‌రుగుతుంది.. అనే పాయింట్ న‌న్ను బాగా నచ్చింది. డైరెక్టర్ 20 నిమిషాలు ఈ ఐడియా గురించి చెప్పారు. ఆరు నెల‌లు 100మంది రౌడిలు ఏం చేయ‌కుండా చూసుకోవాల్సి వ‌స్తే అత‌డి ప‌రిస్థితి ఏంటి ? ఆ వంద మంది రౌడిల‌ను ఎలా కంట్రోల్ చేశాడు అనేదే కథ. అదే నాకు నచ్చింది.

 

ఓటిటి నుండి ఏమైనా ఆఫ‌ర్లు వ‌చ్చాయా ?

చాలా ఆఫర్లు వ‌చ్చాయి కాని.. ఈ సినిమా థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ కోసమే చేశాం. కాబ‌ట్టే ఏప్రిల్ 2న థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నాం.

 

రోజూ వంద‌మందితో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది ?

చాలా ఆఫర్లు వ‌చ్చాయి కాని.. ఈ సినిమా థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ కోసమే చేశాం. కాబ‌ట్టే ఏప్రిల్ 2న థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేస్తున్నాం.

 

సుల్తాన్ అని టైటిల్ పెట్ట‌డానికి రీజ‌నేంటి ?

ఈ సినిమాలో మ‌ళ‌యాలం యాక్ట‌ర్ లాల్ గారు నా గాడ్ ఫాద‌ర్ లాంటి క్యారెక్ట‌ర్ చేశారు. వాళ్లు ఈ సినిమాలో ముస్లీమ్స్‌. చిన్న‌ప్ప‌టినుండి వాళ్లే పెంచుతారు. అత‌ను న‌న్నుముద్దుగా సుల్తాన్ అని పిలుస్తాడు. అందుకే ఆ టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది.

 

ఖైదీ త‌ర్వాత మీ ఆలోచనలో ఎమైనా మార్పు వ‌చ్చిందా ?

లేదండి. ఆ సినిమాలో పాటలు అవ‌స‌రం లేదు..కంటెంట్ మీద వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తే మ‌ణిరత్నం గారితో పొన్నియ‌ణ్ సెల్వ‌న్ సినిమా చేస్తున్నాను. అది ఒక ఎపిక్ మూవీ. ఇలా ప్ర‌తీ సినిమా డిఫ‌రెంట్ గా ఉండేలా చూసుకుంటున్నాను.

 

మీ సినిమాని నాగార్జున గారు విష్ చేశారు క‌దా..?

ముందుగా నాగార్జున గారికి ధ‌న్య‌వాదాలు. ఆ సినిమా ఈవెంట్‌లో కూడా మా సినిమాని విష్ చేశారు. ఆయన నా ఫ్యామిలీమెంబ‌ర్ లాంటి వారు. నాగార్జున గారు మ‌న‌స్పూర్తిగా నాకు విష్ చేశారు..వారికి ఇక్క‌డ నుండి థ్యాంక్స్ చెప్ప‌డం క‌రెక్ట్ కాదు..ఆయ‌న‌ని క‌లిసి థ్యాంక్స్ చెప్తాను.

 

ర‌ష్మిక‌తో ఫస్ట్ ఫిలిం క‌దా! ఆమెతో వ‌ర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌? ‌-

త‌ను ఈ సినిమాలో విలేజ్ అమ్మాయి క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తుంది. త‌ను ఇంత‌కు ముందు అలాంటి పాత్ర‌లు చేసింది అనుకున్నాను. కానీ త‌న‌కి ఇది ఫ‌స్ట్ టైమ్‌. ప‌ల్లెటూరు అంటే ఏం తెలీదు. ఈ సినిమాలో ట్రాక్ట‌ర్ న‌డ‌ప‌డం, పాలు పిత‌క‌డం వంటి ప‌నుల‌న్ని చేసింది. స‌గం మూవీ పూర్త‌య్యాక విలేజ్ లైఫ్ ఇంత ట‌ఫ్‌గా ఉంటుందా అని అడిగేది.

 

లాక్‌డౌన్ త‌ర్వాత తెలుగు, త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో మీరు గ‌మ‌నించిన మార్పులేంటి ?

ఇక్క‌డ సినిమాలు బాగా ఆడుతున్నాయి. తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ల్లే అంద‌రికీ ఒక హోప్ వ‌చ్చింది. నా సినిమా వ‌స్తుంది అన్నప్పుడు కూడా ఇక్క‌డ మంచి సినిమా వ‌స్తే బాగా ఆడుతుంది అనే న‌మ్మ‌కం ఉంది.

సంబంధిత సమాచారం :