ఇంటర్వ్యూ : ఆద శర్మ – పూరి జగన్నాధ్ క్రేజీ డైరెక్టర్..

ఇంటర్వ్యూ : ఆద శర్మ – పూరి జగన్నాధ్ క్రేజీ డైరెక్టర్..

Published on Jan 31, 2014 4:00 AM IST

Adha-Sharma
‘1920’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన ఆద శర్మ టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తీసిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆద శర్మతో మేము కాసేపు ముచ్చటించాం. ఆద శర్మ తనకి ఈ ఆఫర్ ఎలా వచ్చింది? నితిన్, పూరి జగన్నాధ్ గురించి చెప్పిన విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది?

స) ఒక సంవత్సరం క్రితం నేను పూరి గారిని ముంబైలో కలిసాను. ఆయన నేను చేసిన 1920 చూసి నేను మంచి నటినని అన్నారు. అప్పుడే సరైన రోల్ ఉంటే చెప్తాను టాలీవుడ్ లో చేయమని అడిగారు. చెప్పాలంటే ఈ సినిమా కంటే ముందు చేసిన సినిమాకి నన్ను అనుకున్నారు కానీ అది కుదరలేదు. ఈ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నితిన్ నాతో చెప్పాడు. అలా నేను ఆడిషన్స్ కి వెళితే పూరి గారికి నచ్చి నన్ను సెలెక్ట్ చేసారు.

ప్రశ్న) ఈ మూవీలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) ఈ మూవీలో నేను హయతి అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. గోవా లో సెటిల్ అయిన తెలుగమ్మాయి. తన ఫ్రెండ్ ఫాదర్(బ్రహ్మానందం)ని ఒప్పించడం కోసం స్పెయిన్ కి వెళుతుంది. పూరి గారి ప్రతి సినిమాలో ఒక్కో పాత్రకి రెండు షేడ్స్ ఉంటాయి. నా పాత్ర విషయానికి వస్తే ఒక సైడ్ కూడా చూడటానికి చాలా క్యూట్ గా ఉంటుంది, మరో వైపు చాలా ఫైర్ ఉన్న అమ్మాయి. స్వీట్ గా ఉన్న ఈ అమ్మాయి ఇలాంటి పనులు కూడా చేస్తుందా అనేలా నా పాత్ర ఉంటుంది. అలాగే నేను మొదటి సారి చేస్తున్న లవ్ స్టొరీ ఇది. ఈ సినిమాలో నన్నొక ఏంజల్ లా చూపించారు.

ప్రశ్న) ఈ సినిమాకి పూరి జగన్నాధ్ నిర్మాత మరియు దర్శకుడు. దర్శకుడిగా మరియు నిర్మాతగా పూరి జగన్నాధ్ గురించి మీ మాటల్లో..

స) డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ గురించి అంటే.. బాగా సినిమా పిచ్చ ఉన్న వ్యక్తి పూరి జగన్నాధ్. అలాగే క్రేజీ డైరెక్టర్. ఆయన సినిమా గురించి అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటారు. అది మీకు ఈ సినిమా పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి రోజు సెట్లో ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తుంటారు. ఏదో ఒకటి చెప్పి నవ్విస్తూనే ఉంటారు.

నిర్మాతగా అంటే. ముందు నిర్మాత అందరికీ కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకోవాలి. ఆయన సెట్లో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో నేను చేసిన పాత్ర చాలా కష్టమైంది. కానీ భాష రాని నాకు ఆ చాన్స్ ఇచ్చాడు. అందరూ ఈ అమ్మాయి పాత్రకి న్యాయం చేయగలదా? లేదా అనే అనుమానం ఉంటుంది. కానీ అయన నన్ను నమ్మి ఈ చాన్స్ ఇచ్చాడు. ఆయన చేసిన రిస్క్ కి నేను న్యాయం చేసానని అనుకుంటున్నాను.

ప్రశ్న) ఈ మూవీ హీరో నితిన్ గురించి చెప్పండి?

స) రెండు వరుస సూపర్ హిట్ సినిమాలతో నితిన్ సూపర్ స్టార్ అయిపోయాడు. హార్ట్ ఎటాక్ సినిమా నితిన్ ని మరో లెవల్ కి తీసుకెళుతుంది. చాలా మంచి కో స్టార్.

ప్రశ్న) మీరు టాలీవుడ్, బాలీవుడ్ లో పనిచేసారు. బాలీవుడ్, టాలీవుడ్ కి మధ్య ఉన్న తేడా ఏమిటి?

స) బాలీవుడ్ కి, టాలీవుడ్ కి పెద్దగా తేడాలేమీ లేవు. నా వరకు ఐతే బాలీవుడ్ లో అయితే సెట్ లో అసిస్టెంట్స్ గా అమ్మాయిలు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం అబ్బాయిలే ఉన్నారు. అంతకు మించి తేడా ఏం లేదు. అక్కడైనా ఇక్కడైనా అందరూ సినిమా సక్సెస్ అవ్వాలనే ట్రై చేస్తారు.

ప్రశ్న) మీకు హీరోయిన్ అవ్వాలని స్ఫూర్తినిచ్చింది ఎవరు?

స) నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి బ్రేక్ టైం దొరికితే సినిమాలు చూసేదాన్ని, అప్పుడే నేను హీరోయిన్ అవ్వాలనుకున్నాను. నా రూంలో పెద్ద టీవీ ఉంటుంది. అందులో చూసిన అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్ లే నాకు స్ఫూర్తి. అందుకే నేను 10వ తరగతి వరకే చదివి ఆపేసాను. ఆ తర్వాత నేను కథక్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి సినిమాల్లో ట్రై చేసాను. నేను మంచి డాన్సర్ ని కానీ ఈ సినిమాలో డాన్సులు చేసే అవకాశం రాలేదు.

ప్రశ్న) ఈ సినిమాలో లిప్ లాక్స్ ఏమన్నా ఉన్నాయా? అలాగే ఎక్స్ పోజింగ్, లిప్ లాక్స్ పై మీ అభిప్రాయం ఏమిటి?

స) ఈ సినిమాలో లిప్ లాక్ ఉందా లేదా అనేది మీరే సినిమా చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి అదే కీలకం. ఈ సినిమాలో పూరి గారు నేను చూడటానికి హాట్ అండ్ సెక్సీగా కనపడలన్నారు కానీ ఫుల్ డ్రెస్ లో ఉండేలా డిజైన్ చేసారు.

ప్రతుతానికైతే వాటి గురించి పెద్దగా ఆలోచించలేదు. కథ డిమాండ్ చేసే దాన్ని బట్టి లిప్ లాక్స్ మరియు ఎక్స్ పోజింగ్ గురించి ఆలోచిస్తాను.

ప్రశ్న) బ్రహ్మానందంకి మీకు మధ్య ఉన్న కామెడీ ట్రాక్ గురించి చెప్పండి. ఆయనతో పనిచేయడం ఎలా ఉంది?

స) బ్రహ్మానందం గారికి నాకు మధ్య ఉన్న కామెడీ ట్రాక్ చాలా ఫన్నీగా ఉంటుంది. బ్రహ్మనందం లాంటి సీనియర్ తో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన సెట్లో ఉంటే నవ్విస్తూనే ఉంటారు.

ప్రశ్న) హార్ట్ ఎటాక్ కాకుండా ఏమన్నా కొత్త సినిమాలకి సైన్ చేసారా?

స) ఒక బిగ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసాను. కానీ దాన్ని నేను ఇప్పుడు చెప్పలేను. ప్రొడక్షన్ టీం లేదా డైరెక్టర్ చెప్తే బాగుంటుంది.

ప్రశ్న) ఈ సినిమాతో ఎవరు ఎవరికి హార్ట్ ఎటాక్ ఇచ్చారు?

స) మూవీలో అయితే హీరోకి మొదట హార్ట్ ఎటాక్ వస్తుంది. అది ఆడియన్స్ కి హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తుంది. సెకండాఫ్ లో అయితే నేను అబ్బాయిల హార్ట్ బ్రేక్ చేస్తే, నితిన్ అమ్మాయిల హార్ట్ బ్రేక్ చేస్తాడు. ఓవరాల్ గా అయితే ఇది స్వీట్ గా ఉండే హార్ట్ ఎటాక్.

ప్రశ్న) సినిమా రేపు రిలీజ్ కానుంది. కాస్త టెన్షన్ గా ఉన్నారా?

స) చాలా టెన్షన్ గా ఉన్నాను. సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ మరియు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చించి. రేపు సినిమా కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.

అంతటితో ఆద శర్మతో ఇంటర్వ్యూ ముగించి, సినిమా హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము.

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు