ఇంటర్వ్యూ : న‌రేష్ – `శ్రీ‌కారం` తెలుగు ప‌రిశ్ర‌మ‌లో జాతీయ స్థాయిలో చెప్పుకునే సినిమా అవుతుంది

ఇంటర్వ్యూ : న‌రేష్ – `శ్రీ‌కారం` తెలుగు ప‌రిశ్ర‌మ‌లో జాతీయ స్థాయిలో చెప్పుకునే సినిమా అవుతుంది

Published on Mar 5, 2021 11:00 PM IST

 

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం `శ్రీకారం`. ఈ చిత్రం మార్చి 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించిన సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు మీ కోసం..

 

కరోనా తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది ?

క‌రోనా త‌ర్వాత భార‌త‌దేశంలో ప్ర‌తి ఇండ‌స్ట్రీ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌వైపు చూస్తుంది. అందుకు ఒక తెలుగు న‌టుడిగా గ‌ర్వంగా ఉంది. ప్ర‌స్తుతం మ‌న ప‌రిశ్ర‌మ స‌క్సెస్ రేట్ కానీ, యువ ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల‌ సంఖ్య పెర‌గ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం.

 

 మీరు ఈమధ్య చాలా సినిమాలకు సైన్ చేశారు కదా. ఆ విశేషాలు ఏంటి ?

గ‌త ప‌ది సంవత్స‌రాలుగా నేను ఎన్నో మంచి మంచి పాత్ర‌ల్లో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ నాలుగు నెల‌ల కాలంలో నిర్విరామంగా షూటింగ్ చేసి 12 సినిమాల్ని పూర్తిచేశాను. అందులో పాత‌వి కొన్ని ఉన్నాయి అలాగే క‌రోనా త‌ర్వాత మొద‌లైన సినిమాలు ఉన్నాయి. అన్ని మంచి పాత్ర‌లే కావ‌డం విశేషం.

 

త్వరలో రిలీజ్ కానున్న మీ శ్రీకారం సినిమా గురించి చెప్పండి ?

శ్రీ‌కారం విష‌యానికి వ‌స్తే ఎంట‌ర్టైన్‌మెంట్‌ని ఒక కొత్త బ్యాక్ డ్రాప్లో తీసుకుని దానికి ఎమోష‌న్ ని యాడ్ చేసి ఒక యువ ద‌ర్శ‌కుడితో ఈ సినిమా తీసినందుకు ముందుగా 14రీల్స్ ప్ల‌స్ నిర్మాత‌ల్ని నేను అభినందిస్తున్నాను. రామ్ ఆచంట, గోపి ఆచంట, హరీష్ క‌ట్టా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో డెడికేటెట్ ప్రొడ్యూస‌ర్స్‌. నేను గ‌తంలో కూడా వారితో ప‌నిచేశాను.

 

సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ?

రియాల్టీకి ద‌గ్గ‌ర‌గా ఎమోష‌న్స్‌ని క‌నెక్ట్ చేసి తీసిన ఈ సినిమా అవార్ఢులు, రివార్ఢులు తీసుకువ‌స్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను. త‌ప్ప‌కుండా తెలుగు ప‌రిశ్ర‌మ‌లో జాతీయ స్థాయిలో చెప్పుకునే మంచి సినిమా అవుతుంది.

 

ఈ సినిమా థీమ్ ఏంటి ?

ఈ రోజుల్లో చాలా మంది ఎన్నారైలు ఉద్యోగాలు వ‌దిలిపెట్టి వ్య‌వ‌సాయం చేయ‌డానికి ఇక్క‌డికి వ‌స్తున్నారు దాన్ని బేస్ గా తీసుకుని కిషోర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

 

మీ హీరో శర్వానంద్ గురించి చెప్పండి ?

శ‌ర్వానంద్ న్యూ జ‌న‌రేష‌న్ హీరో. ఇలాంటి మంచి స‌బ్జెక్ట్ ఎన్నుకున్నందుకు శ‌ర్వాని నేను అభినందిస్తున్నాను. చాలా బాగా న‌టించాడు. సాయి మాధ‌వ్ బుర్రా అద్భుత‌మైన సంభాష‌ణ‌ల్ని రాశారు.

 

ఇందులో మీ పాత్ర ప్రత్యేక ఏంటి ?

ఈ సినిమాలో చాలా ఎమోష‌న‌ల్‌గా ఫీల‌య్యే రైతు పాత్రలో న‌టించాను. నా పాత్ర గురించి ఇప్పుడే చెప్ప‌ను కాని రేపు థియేట‌ర్‌లో మీరు థ్రిల్ ఫీల‌వుతారు. క‌థ‌లో చాలా ముఖ్య‌మైన పాత్ర‌. త‌ప్ప‌కుండా నా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు