ఇంటర్వ్యూ : సుధీర్ బాబు – ‘శ్రీదేవి సోడా సెంటర్’ తో తెలుగు సినిమా కోసం అంతా మాట్లాడుకుంటారు

Published on Aug 26, 2021 3:38 pm IST


చెప్పండి ఈ సినిమాతో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?

నేను ‘పలాస 1978’ చూసాక డైరెక్టర్ కి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాను. అప్పుడే మంచి లైన్ ఉంటే చెప్పండి చేద్దాం అన్నాను. ఆ తర్వాత ఆయన ఉందని చెప్పారు సరిగ్గా విందాం అనే లోపే ఫస్ట్ లాక్ డౌన్ పెట్టేసారు. ఆ టైం లోనే కొంచెం రిస్క్ అయినా సరే డైరెక్ట్ గా మీట్ అయ్యి కథ విన్నాను. ఆ టైం రిస్క్ అయినా కూడా మంచి కథ విన్నా అనిపించింది. అలా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమా చెయ్యడానికి ఏది మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది?

అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. నేను కూడా ఇప్పటికే ఎన్నో జానర్స్ చేశాను. ఒక్కో దానికి ఒకటి సంబంధం లేకుండా చేసినప్పుడు అన్నిటికీ సూట్ అయ్యాను అనేవాళ్ళు ఉన్నారు. ఇపుడు ఈ సినిమా ఏమిటంటే చాలా రియలిస్టిక్ గా ఉంటుంది అలా అని రా సబ్జెక్ట్ లా ఉండదు. మంచి కమెర్షియల్ ఎలిమెంట్స్, కంటెంట్ అన్నీ కలిపి ఉంటాయి. ఇప్పటి వరకు అందరు మళయాళం సినిమా మళయాళం సినిమా అంటుంటారు వారు ఇప్పుడు నుంచి తెలుగు సినిమా కోసం మాట్లాడుకుంటారు. అందుకే ఈ సినిమా చేశా.

సినిమాలో క్యాస్ట్ కోసం కూడా టచ్ చేసినట్టు ఉన్నారు కాంట్రవర్సీ ఏమన్నా ఉంటుందా? తేడా ఏమన్నా చూపిస్తున్నారా?

అలా అని ఏం ఉండదు సినిమాకి అవసరం అయ్యినంత వరకే ఉంటుంది. పర్టిక్యులర్ గా ఒక క్యాస్ట్ కోసం అని ఏం ఉండదు ఒక గ్రామంలో ఉండే లోకల్ పాలిటిక్స్, అక్కడ ఉండే మనుషుల స్వభావాలు ఈగో వంటివి కనిపిస్తాయి అంతే అంతకు మించి ఏం ఉండదు. అలాగే ఇదేమి పాత కాలపు సినిమా కాదు ప్రస్తుతం నడిచే స్టోరీనే అన్ని పత్రాలు కూడా మనకి తెలిసినట్టుగానే ఉంటాయి.

అసలు సినిమా బేసిక్ లైన్ ఏంటి? ఎలా ఉండబోతుంది?

బేసిక్ గా అంటే నా రోల్ సూరిబాబు అనే ఒక ఎలెక్ట్రిషన్ గా కనిపిస్తుంది. అలాంటి కుర్రాడికి తన అమ్మ అంటే ఎంతో ఇష్టం ఆమె ఉండదు కానీ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు మళ్ళీ తన అమ్మ లాంటి అమ్మాయి ఎదురైతే వాళ్ళు ప్రేమలో పడి అక్కడ నుంచి ఎలా ఉంటుంది అన్నదే చూడాల్సింది.

మీ రోల్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు? స్పెషల్ గా ఉందని ఎంపిక చేసారా?

నా లుక్ స్పెషల్ గా ఉంటుందని ఏం ఈ సినిమా చెయ్యలేదు నా గత సినిమాలు అన్నీ చూసుకొని ఎలా ఉంటుందా అని ఈ సినిమా ఓకే చేశాను. ఇంకా స్పెషల్ గా ట్రైనింగ్ అంటే ఏమి తీసుకోలేదు కొంతమంది ఎలెక్ట్రిషియన్స్ తో మాట్లాడాను కటింగ్ ప్లేయర్ ఎలా పట్టుకుంటారు వైర్లు ఎలా తీస్తారు లాంటి చిన్న చిన్న విషయాలు దగ్గరుండి నేర్చుకున్నాను.

ఈ సినిమాకి కూడా ఏమన్నా ఓటిటి ఆఫర్స్ వచ్చాయా?

తప్పకుండా వచ్చాయి. స్టార్టింగ్ నుంచే వస్తున్నా మేము మాత్రం ఇంకో మాట లేకుండా డెఫినెట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాం, ఇప్పుడు చేస్తున్నాం.

మీ పర్శనాలిటీకి తగ్గట్టుగా విలన్ రోల్స్ కూడా చేశారు ఇంకా ఫ్యూచర్ లో కూడా చేస్తారా?

ఇప్పుడు నా దగ్గరకి ఒక కథ వచ్చి అందులోని హీరో, విలన్ రెండిటికి ఒకే ఇంపార్టెన్స్ ఉంది దేనిని ఎంచుకుంటారు అంటే నేను ఖచ్చితంగా హీరో అనే చెప్తాను ఎందుకంటే నేను చిన్నప్పుడు నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను హీరో అంటే ఇలా ఉంటుందా ఆడియెన్స్ లో వారి ఒపీనియన్ ఏంటి అన్నవి చూసా అందుకే హీరోగానే ప్రిఫర్ చేస్తా అలాగే విలన్ గా కూడా చేసినపుడు ఆడియెన్స్ నన్ను అంగీకరించారు.

హీరోయిన్ తో వర్క్ ఎలా అనిపించింది?

తెలుగు అమ్మాయి తను ఇంక మన వాళ్ళతో వర్క్ ఎలా ఉంటుందో తెలిసిందేగా.. మన ఇంట్లో వాళ్ళతో ఎంత ఫ్రీగా ఉంటామో అలా అనిపించింది. తనతో ముందు ప్రేమ కథా చిత్రం చెయ్యాల్సి ఉంది కానీ అప్పుడు నందితాని ఓకే చేసాం కానీ తమిళ్ లో ఈమే చేసింది అది చూసాక బాగా చేసింది అనిపించింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా తన 100 పర్సెంట్ వర్క్ ని చాలా సిన్సియర్ గా ఇచ్చింది తనతో వర్క్ చెయ్యడం హ్యాపీగా అనిపించింది.

మరి డైరెక్టర్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది?

మాములుగా స్టోరీస్ రాసే వాళ్లలో డైరెక్టర్స్ గా మారితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ కరుణా లో ఒక స్పెషలాటి ఉంది. ఏదన్నా సీన్ కి చిన్న మార్పు చెయ్యాలి అంటే అక్కడక్కడే డైలాగ్ రాయగలడు, చాలా స్ట్రాంగ్ ఐడియాలజి కూడా తనలో ఉంది. చాలా స్ట్రాంగ్ కంటెంట్స్ ని రాయగలడు తను.

అందరూ మీ ఫిట్నెస్ కోసమే మాట్లాడుతున్నారు సీక్రెట్ ఏంటి?

అందరూ అలా అంటుంటే చిరాకొచ్చేస్తుంది(నవ్వుతూ), అంటే నేను ముందు అనుకున్నాను హీరో అన్నాక ఇలా ఉండాలి ఫిట్ గా బాగుండాలి అని అందుకే ఇలా మైంటైన్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు అందరి ఫోకస్ దాని కోసమే ఉంటుంది దీనిపైనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చెయ్యాలి అనుకుంటున్నాను ఇది బొజ్జ పెంచుతున్నా అని, అప్పుడైనా నా యాక్టింగ్ కోసం మాట్లాడుతారేమో మరి.

 

సంబంధిత సమాచారం :