ఇంటర్వ్యూ : సూర్య – ‘బందోబస్త్’ మన దేశానికి సంబందించిన కథ !

Published on Sep 13, 2019 4:40 pm IST

ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేస్తూ ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడని హీరోల్లో ‘సూర్య’ ఒకరు. కాగా సూర్య నటిస్తున్న తాజా సినిమా ‘బందోబస్త్’. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సూర్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

 

బందోబస్త్ చిత్రం గురించి చెప్పండి ?

 

బందోబస్త్ కథ భారత దేశం మొత్తానికి సంబందించిన కథ. వ్యవసాయం, రాజకీయాలు, దేశభద్రత వంటి ప్రధానాంశాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ఇది.

 

కథలో మిమల్ని బాగా ఆకట్టుకున్న అంశాలు ఏమిటి ?

 

ఒక వ్యక్తి సోషల్ వాల్యూస్ వదిలేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి. అసలు ఇంతకీ ఆ వ్యక్తి అలా మారడానికి కారణాలేమిటి ? ప్రధాన మంత్రి ఆఫీస్ లో వాస్తవంగా ఎటువంటి సంఘటలు జరుగుతాయి అనే అంశాలు ఆకట్టుకుంటాయి. ఈ విషయాలు సినిమాలో చాల బాగా చర్చించడం జరిగింది.

 

ఈ చిత్ర దర్శకుడు ఆనంద్ గురించి ?

 

కె వి ఆనంద్ గారి గురించి చెప్పాలంటే.. 1997లో విడుదలైన నా మొదటి చిత్రం ‘నీరుక్కు నేర్’ నుండి ఆయనతో నాకు అనుభందం ఉంది. ఆయన ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. నిజం చెప్పాలంటే ఒక మూవీ సెట్ లో నా మొట్టమొదటి ఫోటో తీసింది ఆయనే. ఆయన రష్యన్ యాంగిల్ లో తీసిన నా ఫోటో అన్ని న్యూస్ పేపర్స్ లో రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నాకు అన్నలాంటి వారు.

 

ఆ అనుబంధం కారణంగానే ఆయనతో ఈ చిత్రం చేశారా ?

 

అనుబంధం ఒక్కటే.. కథ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కె వి ఆనంద్ గారు బేసిక్ గా ఒక జర్నలిస్ట్. ఆయన తీసే సినిమాలు మన చుట్టూ జరిగే వాస్తవ సంఘటనలు ప్రతిబింబించేవిగా ఉంటాయి. ఒక కేసు గురించి కానివ్వండి, పొలిటికల్ ఇష్యూ గురించి కానివ్వండి ఆయన చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి, రీసెర్చ్ చేసి సినిమా తీస్తారు. అందుకే ఆయన సినిమాల్లో కాన్సెప్ట్ లు చాలా లోతుగా ఉంటాయి. అందుకే ఆయన దర్శకత్వంలో నటించడానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తారు.

 

సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

 

దేశభద్రత కోసం ఎంతకైనా తెగించే డైనమిక్ కమాండో అధికారి పాత్ర నాది. మనకు ఒక ఆదేశం వచ్చినప్పుడు వెరవకుండా.. బుల్లెట్ ఎదురుగా వస్తున్నా ముందుకెళ్లే ఢిపెన్సు ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపిస్తాను.

 

మరి ఆ పాత్ర కోసం మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకున్నారు?

 

ఈ పాత్ర చేయడం కోసం చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. అధికారికంగా, అనధికారికంగా అనేక విషయాలపై అధ్యనం చేశాను. అలాగే కొన్ని ప్రత్యేక అనుమతులు తీసుకొని ఢిల్లీలోని ఓ ఆర్మీ క్యాంపులో మూడురోజులు గడపడం జరిగింది. ఆ టైంలో కొందరు కమాండో అధికారులను కలవడం, అనేక విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడ అధికారుల మధ్య సోదర భావం, దేశభక్తి అమోఘం.

 

ఈ సినిమాలో మీతో పాటు మోహన్ లాల్ కూడా నటించారు ?

 

మా ఇద్దరి క్యారెక్టర్స్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాల కొత్తగా ఉంటుంది. ఆయనతో కలిసి నటించడం చాల ఆనందాన్ని కలిగించింది.

 

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?

 

దర్శకుడు శివతో ఓ సినిమా జరుగుతుంది. త్వరలోనే షూట్ కి వెళ్ళబోతున్నాం. అలాగే మరో రెండు సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More