క్రేజీ బజ్: ‘వారణాసి’ అప్డేట్ అప్పుడు రాబోతోందా!?

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’ కోసం అందరికీ తెలిసిందే. పాన్ వరల్డ్ లెవెల్లో గట్టి హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా సాలిడ్ పోస్టర్ లేదా ఇతర అప్డేట్ లాంటివి ఆశించారు కానీ మేకర్స్ మాత్రం పలు హాలీవుడ్ సినిమాల స్టైల్ లో సింపుల్ స్టిల్స్ వదిలారు.

అయితే ఇక వారణాసి నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు అనేది క్రేజీ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం రానున్న ఈ దసరాకే వారణాసి సినిమా నుంచి బిగ్ అప్డేట్ రావచ్చని తెలుస్తుంది. అంతే కాకుండా అక్కడ నుంచే ఇక వరుస అప్డేట్స్ కొనసాగుతాయి అన్నట్టుగా కూడా టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Exit mobile version