గిన్నిస్ రికార్డులకెక్కిన రామానాయుడు

గిన్నిస్ రికార్డులకెక్కిన రామానాయుడు

Published on Dec 7, 2011 2:00 PM IST


మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు గారు సినిమా నిర్మాణంలో దాహార్తి ఇప్పట్లో తీరేలా లేదు. ఈ తరం నిర్మాతలకు ఆయన ఒక తెరిచిన పుస్తకం లాంటి వారు. ఇప్పటి వరకు ఆయన 12 భాషల్లో సినిమాలు నిర్మించారు తాజాగా ఇప్పుడు పంజాబీ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంతో 13 భాషల్లో సినిమాలు తీసిన నిర్మాతగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. నవనీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ధీరజ్ రతన్ స్క్రిప్ట్ అందిస్తున్నారు.

మిగతా నటీ నటులు మరియు సాంకేతిక విభాగాన్ని త్వరలో ప్రకటిస్తారు. ఈ చిత్రం 40 రోజుల్లో చిత్రీకరిస్తారు. రామానాయుడు గారు వచ్చే ఏడాదిలో ఒక దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు