‘జన నాయగన్‌’ విడుదల పై దర్శకుడు కామెంట్స్ !

‘జన నాయగన్‌’ విడుదల పై దర్శకుడు కామెంట్స్ !

Published on May 31, 2026 2:00 PM IST

Jana Nayagan

తమిళ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్‌ హీరోగా నటించిన సినిమా ‘జన నాయగన్‌’. ఐతే, ఈ సినిమా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హెచ్‌.వినోద్‌ తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ మూవీ విడుదల వివాదంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నిజానికి ఈ సినిమా విడుదల మన చేతుల్లో ఉండదు. ఈ చిత్రానికి సంబంధించిన నిజాల గురించి మాట్లాడేందుకు నాకు ధైర్యం లేదు’ అని దర్శకుడు హెచ్‌.వినోద్‌ తెలిపారు.

హెచ్‌.వినోద్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘ఒక వేళ ధైర్యం చేసి మాట్లాడినా.. దానిని టెలీకాస్ట్‌ చేసే ధైర్యం మీకు లేదు’’ అని కామెంట్స్ చేశారు. అసలు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, సెన్సార్‌ విషయంలో కోర్టుల వరకూ వెళ్లింది. ప్రత్యేకంగా ఏర్పాటైన రివైజింగ్‌ కమిటీ ఈ మూవీని చూసి, రిపోర్టు ఇవ్వాలి. ఇంకా ఇవ్వలేదు. ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదని నిర్మాత వెంకట్‌ కె. నారాయణ ఇటీవల తెలిపారు. మొత్తానికి విజయ్‌ సీఎం అయ్యాక కూడా ఈ సినిమా రిలీజ్‌ పై క్లారిటీ రాకపోవడం విచిత్రం.

తాజా వార్తలు