డెడ్ లైన్ పెట్టేసిన ‘దాదా’

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ అలాగే మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామానే దాదా. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుంది. అయితే ఈ సినిమా పూర్తి కావడానికి డెడ్ లైన్ పెట్టేసినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం షూటింగ్ ఇంకా 20 నుంచి 25 రోజుల మీద బ్యాలెన్స్ ఉన్నట్టుగా సమాచారం. దీంతో మొత్తం షూటింగ్ ఈ అక్టోబర్ నాటికి పూర్తయిపోతుంది అన్నట్టుగా టాక్. సో డిసెంబర్ కి దాదా రాక గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పెద్ది సినిమా మేకర్స్ వృద్ది సినిమాస్ వారు భారీ బడ్జెట్ అండ్ క్వాలిటీతో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version