ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఇండియన్ క్రికెటర్, RCB స్టార్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్లో అభిమానులతో పంచుకున్నాడు. టాలెంటెడ్ క్రికెటర్ అయిన వెంకటేష్ అయ్యర్ గారిని కలవడం చాలా ఆనందంగా ఉందంటూ బన్నీ ఈ సందర్భంగా రాసుకొచ్చాడు.
అయితే, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విశేషం కూడా చోటుచేసుకుంది. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కోసం వెంకటేష్ అయ్యర్ ఒక ప్రత్యేకమైన బహుమతి అందించాడట. తన సంతకంతో కూడిన స్పెషల్ క్రికెట్ జెర్సీని అయాన్‌కు వెంకటేష్ అయ్యర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ స్పెషల్ గిఫ్ట్ పట్ల అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేస్తూ వెంకటేష్ అయ్యర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక వెంకటేష్ అయ్యర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ఆయన కెరీర్ అద్భుతంగా సాగాలని అల్లు అర్జున్ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆకాంక్షించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, వెంకటేష్ అయ్యర్ కలిసి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


