మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’

మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’

Published on Aug 18, 2026 9:00 PM IST

కింగ్ నాగార్జున కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’ సరికొత్త రూపంలో మళ్లీ థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సంచలన చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీతో రీ-మాస్టరింగ్ చేసి, 4K వర్షన్‌లో ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయబోతున్నారు.

నాగార్జున పుట్టినరోజు మరియు రాఖీ పండుగ కానుకగా ఈ చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రేమకావ్యాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం, మణిరత్నం టేకింగ్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్.

నాగార్జున, గిరిజల నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ క్లాసిక్‌ని మరింత మెరుగైన విజువల్స్, రిచ్ కలర్స్ మరియు అదిరిపోయే సౌండ్‌తో 4K వర్షన్‌లో బిగ్ స్క్రీన్‌పై తీసుకువస్తుండటంతో నాటి అభిమానులకు నోస్టాల్జియా ఫీలింగ్‌ను అందించడమే కాకుండా, నేటి తరం ప్రేక్షకులకు కూడా ఒక గొప్ప అనుభూతిని ఇవ్వనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు