‘ఇరుముడి’పై మ్యూజిక్ డైరెక్టర్ రివ్యూ.. సోది లేకుండా ఒక్క మాటలో

‘ఇరుముడి’పై మ్యూజిక్ డైరెక్టర్ రివ్యూ.. సోది లేకుండా ఒక్క మాటలో

Published on Aug 18, 2026 6:36 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. డివోషనల్ ఎలిమెంట్స్ తో సహా మంచి ఇంటెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ ని కూడా దర్శకుడు దట్టించి మంచి సినిమా అందిస్తున్నట్టు మేకర్స్ అంతా ధీమాగా ఉన్నారు.

అయితే తమ సినిమాలపై సంగీత దర్శకులు ఇచ్చే రివ్యూస్ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో మరింత కాన్ఫిడెన్స్ నింపుతాయి. ఈ ట్రెండ్ అనిరుద్ నుంచి బాగా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇరుముడి సినిమాకి సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కూడా సింపుల్ రివ్యూ ఇచ్చేసాడు.

‘ఒక క్లాసిక్ రాబోతుంది’ అంటూ ఒక్క మాటలో సినిమా ఇరుముడి కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మరింత కాన్ఫిడెన్స్ ని నింపేసాడు. అంతే కాకుండా సినిమా తాలూకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు కూడా పూర్తి చేసినట్టు సాలిడ్ అప్డేట్ ని తాను అందించాడు. సో మొత్తానికి ఒక క్లాసిక్ వర్క్ ఈ ఆగష్టు 21న రాబోతుంది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు