మెహెర్ రమేష్ తో వెంకీ చిత్రం

venkatest and Ramesh1
ప్రస్తుతం బాడీగార్డ్ పతాక సన్నివేశాల్లో నటిస్తున్న విక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రం మెహర్ రమేష్ తో చేయనున్నన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పరుచూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే ఫుల్ లెంగ్త్ యాక్షన్ స్క్రిప్ట్ కూడా వెంకటేష్ గారికి వినిపించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంబందించిన మిగతా నటీ నటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు సమాచారం. శక్తి వంటి ఫ్లాప్ చిత్రం అందించిన మెహెర్ రమేష్ తదుపరి చిత్రం ఎవరితో చేయనున్నారు అనే ఊహాగానాలకు త్వరలో తెర పడనుంది. “బాడీగార్డ్” చిత్రం సంక్రాంతికి విడుదలవుతున్న విషయం విదితమే. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో పాల్గొంటారు.

Exit mobile version