“నూటొక్క జిల్లాల అందగాడు” ట్రైలర్ తో మరింత క్రేజ్!

Published on Aug 26, 2021 8:47 pm IST

అవసరాల శ్రీనివాస్ మరియు రుహనీ శర్మ హీరో హీరోయిన్ లుగా రాచకొండ విద్యా సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. ఈ చిత్రం పోస్టర్ తో నే ఆసక్తి నెలకొంది. అయితే విడుదల అయిన ట్రైలర్ ఒక్క రోజు లోనే విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం ట్రైలర్ ఒక్క రోజులో 1.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూ ట్యూబ్ లో టాప్ ట్రెండ్ లో ఈ ట్రైలర్ ఉండటం విశేషం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాల పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తూనే, ఈ చిత్రానికి కథ అందించారు. ట్రైలర్ తోనే ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మూడవ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :