సమంత ఖాతాలో 10 లక్షల ఫాలోయర్లు..!

samantha
ఒకప్పుడు సినీ ప్రముఖుల ఆదరణను వారు నటించిన సినిమా విజయాలు, ప్రతిభ ఆధారంగా కొలచేవారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సామాజిక అనుసంధాన వేదికలలో వారిని ఎంతమంది అనుసరిస్తున్నారు అనే విషయాన్ని బట్టి అంచనా వేస్తున్నారు.

తెలుగు, తమిళ చిత్రసీమలలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంతను ట్విట్టర్లో ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్ మార్క్ ను చేరుకుంది. ఈ చెన్నై సుందరి సినిమాలతో పాటు సామాజిక సేవలో కూడా ముందుంది. ప్రతిరోజూ అభిమానులతో సమంత ట్విట్టర్లో టచ్ లో ఉంటుంది. సినిమాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించడం సమంత ప్రత్యేకత.

‘ఏం మాయ చేసావే’తో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన సమంత, తొలి సినిమాతోనే తన అభినమయంతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ‘దూకుడు’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.

సమంత ట్విట్టర్ అకౌంటు : https://twitter.com/Samanthaprabhu2

Exit mobile version