దుల్కర్ సల్మాన్-నిత్యామీనన్ సినిమా రిలీజ్ డేట్!

ok-bangaram

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’ సినిమా గతేడాది విడుదలై తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన దుల్కర్ సల్మాన్ – నిత్యా మీనన్‌ల జోడీకి కూడా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ నేపథ్యంలోనే గతంలో దుల్కర్-నిత్యా జంటగా నటించిన మళయాల సినిమాలు కొన్ని తెలుగు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ‘ఉస్తాద్ హోటల్’ అనే సినిమా ‘జతగా’ అంటూ, ‘100 డేస్ ఆఫ్ లవ్’ అనే సినిమా అదే పేరుతో తెలుగులో వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.

ఈ సినిమాల్లో ‘100 డేస్ ఆఫ్ లవ్’ ఈమధ్యే ఆడియో వేడుక జరుపుకుంది. ఇక తాజాగా సినిమా విడుదల తేదీ కూడా ఖరారైంది. ఆగష్టు 26న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని టీమ్ అధికారికంగా తెలిపింది. ఇప్పటికే తెలుగు డబ్బింగ్‌కు సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. జెనుస్ మహమ్మద్ నిర్మించిన ఈ సినిమా మళయాలంలో గతేడాది విడుదలై మంచి హిట్ కొట్టింది. తెలుగులో కూడా సినిమా అదే స్థాయి విజయం సాధిస్తుందని తెలుగు వర్షన్ నిర్మాత ఎస్.వెంకటరత్నం ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version