ఏ మాత్రం తగ్గని “మన శంకర వరప్రసాద్ గారు” జోరు !

ఏ మాత్రం తగ్గని “మన శంకర వరప్రసాద్ గారు” జోరు !

Published on Jan 26, 2026 8:01 AM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu). ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సాధించింది. కాగా ఈ సినిమా రిలీజ్ అయి 14 రోజులు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి నిదర్శనం రెండో ఆదివారం టిక్కెట్ల అమ్మకాలే. బుక్‌మైషోలో గత 24 గంటల్లో 121 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి, ఇది రెండో శనివారం నమోదైన అమ్మకాల కంటే ఎక్కువ.

మొత్తమ్మీద ఈ సినిమాకి వస్తున్న భారీ కలెక్షన్లను బట్టి.. మెగాస్టార్ కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి విన్నర్ “మన శంకర వరప్రసాద్ గారు” అని తేలిపోయింది. పైగా రాబోయే వారంలో ఈ చిత్రానికి పెద్దగా పోటీ కూడా లేదు. కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

Mana Shankara Vara Prasad Garu

తాజా వార్తలు