విడుదల తేదీ : జనవరి 25, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: తాళ్లూరి రామేశ్వరి, అన్విత్, మణి మంతెన తదితరులు
దర్శకుడు: ముళ్ళపూడి వర
నిర్మాణం: రామ్ విశ్వాస్ హనుర్కర్, రాఘవేంద్ర వర్మ
సంగీతం: సాయి మధుకర్
ఛాయాగ్రహణం: శేఖర్ గంగనమోని
కూర్పు: రాఘవేంద్ర వర్మ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు ఓటిటి యాప్ ఈటీవీ విన్ లో లేటెస్ట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘గొల్ల రామవ్వ’. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
1947 భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ మాత్రం ఇంకా రజాకార్ల గుప్పిట్లోనే ఉంటుంది. అలా 1948 అడవి దేవరాపల్లి – హైదరాబాద్ ప్రాంతంలో రజాకార్ల నిరంకుశ పాలనకు తిరుగుబాటుగా ఓ యువకుడు (అన్విత్) జనంలో తన పదునైన మాటలతో ప్రజల్లో చైతన్యం నింపుతాడు. అలా ఆ సమీప గ్రామంలోనే ఉండే గొల్ల రామవ్వ (తాళ్లూరి రామేశ్వరి) అనే ఒక ముసలావిడ కూడా ఆ ప్రసంగ సమయంలో ఉంటుంది కానీ ఇలాంటి తిరుగుబాట్లు మూలాన తమ ప్రాణ నష్టమే మిగుల్తుంది. అని భావిస్తుంది. అయితే రజాకార్లు దాడిలో ఆ యువకున్ని పట్టుకునే ప్రయత్నంలో గాయాల పాలై ఆ బామ్మ ఇంటికి చేరుతాడు. మరి అక్కడ నుంచి కథ ఎలా మారింది? ఆమె అతని కోసం ఏం చేశారు? రజాకార్లతో ఆమె చేసిన వీరోచిత పోరాటం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమా మొదలైన కొన్ని క్షణాలకే సాయి కుమార్ వాయిస్ ఓవర్ లో దీని తాలూకా పరిచయం అందించడం బాగుంది. భారతదేశ అప్పటి ప్రధాని, పీవీ నరసింహా రావు గారు రాసిన గొల్ల రామవ్వ పుస్తకం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో దర్శకుడు నాచురాలిటీ ఎక్కడా మిస్ అవ్వలేదు అంతే కాకుండా అందులో ఉన్న ఎమోషన్ ని కూడా బాగా పట్టుకొని నటీ నటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ లు రాబట్టారు.
అలాగే యువ విప్లవకారుని పాత్రలో అన్విత్ బాగా చేసాడు. మంచి డైలాగ్ లు అనర్గళంగా చెబుతూ మెప్పించాడు. అలాగే సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి గొల్ల రామవ్వగా జీవించారు. తన పాత్రలోని షేడ్స్ ని బాగా చేశారు. అలాగే రజాకార్ల పాలన నాటి సమయంలో ఎన్నో తెలియని ఘట్టాల్లో ఇది కూడా ఒకటి సో అప్పటి చరిత్ర పట్ల కుతూహలంగా ఉన్నవారికి ఇది మరో అరుదైన ఎంపికగా కూడా నిలుస్తుంది.
మైనస్ పాయింట్స్:
గొల్ల రామవ్వ కోసం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో రజాకర్ల నేపథ్యంలో వచ్చిన సినిమాలు చూసిన వారికీ ఈ కంటెంట్ రొటీన్ అనిపించవచ్చు. అప్పటి సమయంలోనే ఇది మరొక చిన్న భాగం కాబట్టి పూర్తిగా కొత్తదనమే కావాలి అనుకునేవారు కొంచెం రొటీన్ ఫీల్ అవ్వొచ్చు.
అలాగే గంగవ్వ పాత్రని ఇంకొంచెం మెరుగ్గా డిజైన్ చేయాల్సింది. సాఫ్ట్ యాంగిల్ లో బాగానే చూపించారు కానీ ఎప్పుడైతే తన పాత్రలో తిరుబాటు వస్తుందో ఆ సమయంలో ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. మొత్తం సెటప్ ని ఇందులో బాగా చేసుకున్నారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా నీట్ గా ఉంది. సంగీతం, కెమెరా వర్క్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు ముళ్ళపూడి వర విషయానికి వస్తే.. తన కథాంశం ఎంపిక బాగుంది. అలాగే దాదాపు ప్రెజెంటేషన్ కూడా నీట్ గా అందించే ప్రయత్నం చేశారు. కాకపోతే చివరికి వచ్చే సరికి ఇంకొంచెం మెరుగ్గా పరిస్థితులు మార్చి ఎమోషన్ ని బాగా పండించి ఉంటే ఇది మరింత ఇంపాక్ట్ చూపించేది. అయినప్పటికీ తన వర్క్ బాగానే ఉంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘గొల్ల రామవ్వ’ అనే లఘు చిత్రం డీసెంట్ గానే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో రజాకర్ల నేపథ్యంలో పలు సినిమాలు కూడా వచ్చాయి. అలా వాటి మూలాల తోనే వచ్చిన ఈ షార్ట్ ఫిలిం గొల్ల రామవ్వ ధైర్య సాహసాలని ప్రస్తుత తరానికి తెలిసేలా చెప్తుంది. అయితే డైలాగ్స్, కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి కానీ చివరి కొన్ని నిమిషాలని ఇంకా ప్రభావవంతంగా ప్రెజెంట్ చేయాల్సింది. ఇది మినహాయిస్తే చరిత్రకి సంబంధించిన కంటెంట్ ని చూడాలి అనుకునేవారు ఈ లఘు చిత్రాన్ని ఈటీవీ విన్ లో ఒకసారి ట్రై చేయొచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


