ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరొక ట్రెండ్ సెట్ చేశారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఈ ఫీట్ అందుకున్న హీరో లలో అల్లు అర్జున్ సౌత్ ఇండియా నుండి ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఇప్పటి వరకు 492 పోస్ట్ లు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో అల్లు స్నేహరెడ్డి ను మాత్రమే ఫాలో అవుతున్నారు.
అల్లు అర్జున్ సోషల్ మీడియా లో యాక్టిివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తాజా చిత్రం అయిన పుష్ప విడుదల కి సిద్దం అవుతోంది. డిసెంబర్ లో పుష్ప ది రైస్ మొదటి భాగం విడుదల కానుంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఫాహద్ ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటిస్తున్నారు.


