కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్

కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్

Published on Mar 19, 2013 12:05 PM IST

14_Reels_Entertainment
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘దూకుడు’ చిత్రాన్ని నిర్మించి ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతున్న ప్రతిష్టాత్మక 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ బ్యానర్ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో ఓ సినిమా నిర్మించనుంది. ఈ సినిమాకి ఓ ప్రముఖ కన్నడ డైరెక్టర్ నిర్మించాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి టైటిల్ గా ‘ప్రొడక్షన్ నెం. 6’ పెట్టడం జరిగింది.కన్నడ లో పెద్ద స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నిర్మిస్తున్న ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను, దీనిలో నటించబోయే హీరోయిన్, మిగిలిన తారల వివరాలను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు మహేష్ బాబు – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న సినిమా నిర్మాణ పనులలో బిజీగా ఉంది. అలాగే మహేష్ బాబు – డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమాని నిర్మించనుంది. ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో ప్రారంభం కానుంది. వీటితో పాటుగా నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా నిర్మించనుంది. కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టినందుకు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారికి 123తెలుగు.కామ్ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు