18 పేజెస్ కి సూపర్ రెస్పాన్స్…3 రోజుల కలెక్షన్స్ ఇవే!

18 పేజెస్ కి సూపర్ రెస్పాన్స్…3 రోజుల కలెక్షన్స్ ఇవే!

Published on Dec 26, 2022 3:59 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ 18 పేజెస్. కుమారి 21 ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో 11 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు కంటే కూడా మూడో రోజు ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది.

టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా కి స్టోరీ ను అందించగా, గీతా ఆర్ట్స్ 2 మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు