బుక్ మై షో లో రికార్డు బ్రేక్ చేసిన 2.0 !

బుక్ మై షో లో రికార్డు బ్రేక్ చేసిన 2.0 !

Published on Nov 28, 2018 3:13 PM IST

లీడింగ్ ఆన్ లైన్ మూవీ టికెట్ పోర్టల్ బుక్ మై షో లో 2.0 కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి ఇప్పటివరకు అడ్వాన్స్ గా 10లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయని బుక్ మై షో అధికారికంగా ప్రకటించింది. దేశ సినీ చరిత్రలో ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్ కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇంతకుముందు ‘బాహుబలి , అవెంజర్స్’ చిత్రాలు భారీ స్థాయిలో బుకింగ్స్ ను రాబట్టాయి. తాజాగా 2.0 ఆ రికార్డు లను బ్రేక్ చేసింది. ఇది ఒక్కటి చాలు ఈసినిమా క్రేజ్ ఏ స్థాయిలో వుందని చెప్పడానికి. సూపర్ హిట్ మూవీ రోబో కి సీక్వెల్ గా వస్తున్న ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,500 స్క్రీన్ లలో రేపటినుండి సందడి చేయనుంది.

ఇక ఈచిత్రం దేశ సినీ చరిత్రలో అత్యధిక స్క్రీన్ లలో విడుదలవుతున్నచిత్రంగా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ‘బాహుబలి 2’ ప్రపంచ వ్యాప్తంగా 9000 స్క్రీన్ లలో విడుదలకాబడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు