షాక్ ఇస్తున్న 2.0 శాటిలైట్ హక్కుల ధర !

షాక్ ఇస్తున్న 2.0 శాటిలైట్ హక్కుల ధర !

Published on Nov 25, 2018 4:00 AM IST

సినీ ఇండస్ట్రీ దృష్టంతా ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘2.0’ పైనే ఉంది. 600కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం మొదటి రోజు ఎంత మేరకు కలెక్షన్స్ ను రాబడుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలావుంటే ఈచిత్రం యొక్క తెలుగు , తమిళ , హిందీ శాటిలైట్ హక్కులు 120కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైపోయాని సమాచారం. అలాగే డిజిటల్ హక్కుల రూపంలో మరో 60కోట్లు వచ్చాయట. ఈలెక్కన కేవలం ఈ రైట్స్ రూపంలోనే 30శాతం పెట్టుబడి వెనక్కి వచ్చేసిందట.

ఇక మొదటి రోజు హిట్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫిస్ వద్ద ఈసినిమా రికార్డులను కొల్లగొట్టడం పక్క. మరి ఈ చిత్రం యొక్క ఫలితం తేలాలంటే నవంబర్ 29వరకు వేచిచూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు