పురాణపండ సమక్షంలో మైహోమ్ అవతార్ లో రెండు లక్షల దివ్యగ్రంథాలకు అర్చన

పురాణపండ సమక్షంలో మైహోమ్ అవతార్ లో రెండు లక్షల దివ్యగ్రంథాలకు అర్చన

Published on Jun 6, 2026 3:48 PM IST

Puranapanda Srinivas My Home Avatar

Puranapanda Srinivas My Home Avatar

Puranapanda Srinivas My Home Avatar

Puranapanda Srinivas My Home Avatar

Puranapanda Srinivas, My Home Avatar

హైదరాబాద్ : జూన్ : 6

ఒక మహాద్భుతానికి , ఒక మహా పవిత్ర ప్రయోగ శీలతకు , ఒక అపురూప భక్తి రసావిష్కరణకు మైహోమ్ అవతారు వాసులైన సుమారు మూడువేల విల్లాల వారు ఒకే త్రాటిపై నిలిచి నగర ప్రముఖులైన దేవిరెడ్డి ప్రభాకర రెడ్డి , ఉత్పల జగన్మోహిని , గాంధీ చంద్రశేఖర్ ల పర్యవేక్షణలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనాలైన తిరుమల , శ్రీశైల దైవీయ చైతన్య వెలుగులుగా విష్ణు, శివ గ్రంధాలను ఒక్కొక్కటి లక్ష ప్రతులు చొప్పున , రెండు గ్రంధాలను ఏక మొత్తంగా రెండు లక్షల ప్రతులను మైహోం అవతార్ పార్క్ ప్రాంగణంలో ఆవిష్కరింప చెయ్యడం హైదరాబాద్ ఆధ్యాత్మిక చరిత్రలో అపూర్వ సువర్ణ అధ్యాయంగా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.

వందలకొలది ఆరెస్సెస్ కార్యకర్తల , వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగుల , నగర ప్రముఖుల సమక్షంలో శనివారం నాడు అత్యంత ప్రశాంత వాతావరణంలో రమణీయంగా జరిగిన ఈ రెండు లక్షల దివ్య గ్రంధాల సమర్పణ కార్యక్రమం సుమారు రెండున్నర గంటల సేపు ఆదంతం హృద్యంగా సాగడం విశేషం. ఈ శ్రీకార్యంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ పదునాలు లోకాల పరమాధికారి శ్రీ లక్ష్మీ నారసింహునికారుణ్యంతోనే ఇంతటి మహాకార్యాన్ని చెయ్యగలుగుతున్నామని , తాము నిమిత్తమాత్రులమని పేర్కొన్నారు. ఈసందర్భంలో ఆయన చేసిన ప్రసంగం వందలమంది ఆడియన్స్ చేత వన్స్ మోర్ అంటూ చప్పట్లు కొట్టించింది.

Puranapanda Srinivas, My Home Avatar

అనంతరం …ఉత్పల జగన్మోహిని , గాంధీ చంద్రశేఖర్ బృందం పర్యవేక్షణలో వేల వేల గ్రంధాలు కాటన్ బాక్స్ ల ద్వారా భక్త బృందాలకు చేరింది. శృంగేరీ శంకరమఠం చండీ ఉపాసకులు నిమ్మకంటి శ్రీనివాస శర్మ బృందం వేద మంత్ర ధ్వనులు ఉదాత్తంగా సాగుతుండగా ప్రాంగణంలో మల్లెలు , చేమంతులతో రెండు లక్షల గ్రంధాలకు మహా సరస్వతీ అర్చన జరగడం విశేషం.

మహా సౌందర్యం , మహామంత్రస్య, నేనున్నాను, అమ్మణ్ణి , జయం జయం , శ్రీమాలిక వంటి అద్భుత గ్రంధాల రచయితగా , సంకలన కర్తగా లక్షల లోగిళ్ళలో లక్షల భక్త హృదయ విజేతగా , మంచి వక్తగా దేశ దేశాలలో తెలుగు ఎదలపై విశేష ఖ్యాతి గడించడమే కాకుండా నిస్వార్ధ ధార్మిక సేవకునిగా అగ్రగణ్య స్థానంలో ఉన్న పురాణపండ శ్రీనివాస్ ఈ పవిత్ర ప్రయోగం జంట నగరాల్లోనే తొలిసారికావడంతో ఆధ్యాత్మిక , సాహిత్య , కవిత్వ రంగాలలో బలమైన పవిత్ర సంచలనం సృష్టించింది.

Puranapanda Srinivas, My Home Avatar

ఇదిలా ఉండగా … మాజీ మంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ , బొల్లినేని కృష్ణయ్య , ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామ నారాయణరెడ్డి , ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో నాటి ఐ టి శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య , ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ , శాంతా బయోటెక్ అధినేత , పద్మభూషణ్ ఐ . వరప్రసాదం రెడ్డి , పద్మభూషణ్, హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ , ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ , వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి , మాజీ మంత్రి, నటి ఆర్కే రోజా తదితర ప్రముఖుల సమర్పణలో పరమాద్భుతంగా ప్రచురించబడిన పురాణపండ శ్రేనివాస్ రచనసంకలనాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏదేమైనా పీఠాలు, మఠాలు ఉన్న స్వామీజీలు సైతం చెయ్యని ఎంతో విలువైన రచనా ధార్మిక సేవ పురాణపండ శ్రీనివాస్ చెయ్యడం ఆషామాషీ వ్యవహారం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పూర్వ సలహాదారు, సీనియర్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి ఎన్నో సభల్లో పేర్కొన్న అంశం కఠిన సత్యమేనని మేధోసమాజం సైతం తల ఊపుతోంది. ఈ మహా ఉదాత్త కార్యాన్ని అత్యంత సమర్ధవంతంగా నడిపించిన జగన్మోహిని , చంద్రశేఖర్ లను మైహోమ్ అవతార్ వాసులు ముక్త కంఠంతో ప్రశంసిస్తున్నారు.

Puranapanda Srinivas, My Home Avatar

ఈ రెండు లక్షల గ్రంధాల ఆవిష్కరణ, వితరణ కార్యక్రమం అనంతరం పురాణపండ శ్రీనివాస్ తో సెల్ఫీలకు మాతృమూర్తులతోపాటు యువతీ యువకులు సైతం ఆసక్తి చూపడం గమనార్హం. మైహోమ్ఈ అవతార్ కమిటీ సంపూర్ణ ప్రోత్సాహంతో జరిగిన ఈ వేడుకలో సంకటహరణ హనుమాన్ దేవాలయం చైర్మన్ టి . అంజన్ కుమార్ , కార్యవర్గ ప్రతినిధి వినోద్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Puranapanda Srinivas, My Home Avatar

సంబంధిత సమాచారం

తాజా వార్తలు