అడవి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా నటిస్తోన్న సినిమా ‘2 స్టేట్స్’ . వెంకట్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 5 నుండి ప్రారంభం కానుంది. మొదటిసారి తెలుగులో మనీషా సత్యవోదు అనే అమ్మాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తోంది.
ప్రస్తుతం చిత్ర యూనిట్ కలకత్తాలో లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నారు. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు శనీల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను త్వరలో అనౌన్స్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. చాలా సినిమాలు ఆఫర్స్ వచ్చినా రాజశేఖర్ అమ్మాయి ఈ కథ నచ్చడంతో ఈ మూవీతో ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇస్తుంది.
