20 మిలియన్ వ్యూస్ సాధించిన వలిమై “నాంగ వీర మారి” పాట!

Published on Aug 23, 2021 2:55 pm IST


హెచ్. వినొత్ దర్శకత్వం లో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం నుండి ఇటీవల నాంగ వీర మారి పాట విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాట సోషల్ మీడియా లో విపరీతంగా ట్రెండ్ అవ్వడం మాత్రమే కాకుండా, యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ ను సాధించడం జరిగింది. ఈ పాట విడుదల అయి రెండు వారాలు దాటింది. ఈ పాట కి యూ ట్యూబ్ లో 20 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అంతేకాక 1.2 మిలియన్ లైక్స్ రావడం విశేషం.

అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో హుమ ఖురేషీ, కార్తికేయ, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :