“భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ కి 20 మిలియన్ వ్యూస్!

Published on Sep 8, 2021 5:42 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరొక పక్క యూ ట్యూబ్ లో ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్న టాలీవుడ్ సాంగ్ గా నిలిచింది.

తాజాగా ఈ పాట 20 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం చిత్రానికి ఇది రీమేక్ అవ్వడం, విలన్ పాత్ర కూడా హీరో పాత్ర కు ధీటుగా ఉండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తుంది. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :