‘బాహుబలి 2’ 2016లో వచ్చే అవకాశం లేదా?

‘బాహుబలి 2’ 2016లో వచ్చే అవకాశం లేదా?

Published on Nov 3, 2015 8:23 PM IST

baahubali11

బాహుబలి.. ఇండియన్ సినిమాకు మార్కెట్ పరంగా, సాంకేతిక స్థాయి పరంగా ఓ సరికొత్త అర్థాన్నిచ్చిన సినిమా. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించగా దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమాలో ఓ ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా రెండో భాగం ఉంటుందన్న విషయాన్ని ముందే చెప్పిన బాహుబలి టీమ్, బాహుబలి మొదటి భాగాన్ని ఓ అతిపెద్ద సస్పెన్స్‌‌తో ముగించి రెండో భాగానిపై ఇప్పట్నుంచే అంచనాలను పెంచేసింది.

బాహుబలి ది కంక్లూజన్ పేరుతో రానున్న రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని బాహుబలి దర్శక నిర్మాతలు ప్రకటించినా, ప్రస్తుత పరిస్థితుల్లో 2016లో బాహుబలి పార్ట్ 2 విడుదలయ్యే సూచనలు చాలా తక్కువ అని తెలుస్తోంది. డిసెంబర్ నెలలో గానీ, జనవరి మొదటి వారంలో గానీ సెట్స్‌పైకి వెళ్ళే సినిమా 2016 పూర్తయ్యే నాటికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ పూర్తి చేసుకొని విడుదలవ్వడం అషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా బాహుబలిని మించి పోయేలా పార్ట్ 2 ఉంటుందని, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని కథనాలు వస్తోన్న నేపథ్యంలో 2016కల్లా అనుకున్నవన్నీ జరిగే సూచనలు లేవని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2017లోనే బాహుబలి విడుదలయ్యే సూచనలు ఎక్కువున్నాయన్నది ప్రస్తుతం బాహుబలి 2 విషయంలో ఎక్కువగా వినిపిస్తోన్న సమాధానం!

తాజా వార్తలు