ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సినిమాలే కాకుండా అంతకు మించి పీక్ ఎక్స్ పీరియన్స్ ని మొబైల్ ఫోన్స్, ఇంట్లో టీవీ లలోనే ఓటిటిలు అందించేస్తున్నాయి. ఇలా వరల్డ్ వైడ్ గా గత ఏడాదిలో పలు భారీ సిరీస్ లు వచ్చి అలరించాయి. అయితే వీటిలో అనేక దేశాల నుంచి పలు సిరీస్ లు మరింత గ్రాండ్ అండ్ రిచ్ వాల్యూస్ తో వచ్చి మంచి రెస్పాన్స్ ని సాధించాయి. ఇలా గత 2025 మొత్తానికి కలిపి ఓ టాప్ 5 వెబ్ సిరీస్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కి మాసివ్ విజువల్ అండ్ యాక్షన్ ట్రీట్ ని అందించే విధంగా పలు స్ట్రీమింగ్ యాప్స్ లో వచ్చాయి. మరి అవేంటి ఎందులో ఉన్నాయో చూద్దాం.
టాప్ 5 – ది లాస్ట్ ఆఫ్ అస్: సీజన్ 2 (The Last of Us)
ఒక రివెంజ్ స్టోరీగా వచ్చిన ఈ సిరీస్ ని ఇంటర్నేషనల్ పాపులర్ సంస్థ హెచ్ బి ఓ(HBO) వారు రిలీజ్ కి తీసుకొచ్చారు. మరి ఈ సిరీస్ తాలూకా సీజన్ 2 మొత్తం 7 ఎపిసోడ్స్ గా తీసుకొచ్చారు. అయితే ఈ ఒక్క సీజన్ కే ఏకంగా 125 మిలియన్ డాలర్స్ (1000 కోట్ల) కి పైగా ఖర్చు పెట్టారట. ఇక ఈ సిరీస్ ఇండియాలో జియో హాట్ స్టార్ లో తర్వాత అందుబాటులోకి వచ్చింది.
టాప్ – 4 ఫ్లూరిబస్: సీజన్ 1 (Pluribus Season 1)
ఇదొక ఇంట్రెస్టింగ్ సై ఫై థ్రిల్లర్ కాగా ఒక వైరస్ అంతరిక్షం నుంచి వచ్చి భూమిపై ఉండే మనుషులకి కలిగించిన ప్రభావం ఏంటి? ఇందులో ఓ ఒంటరి మహిళ ఏం చేసింది అనేది కీలక ప్లాట్. అయితే ఈ సిరీస్ ని యాపిల్ టీవీ వారు గత నవంబర్ 7న స్ట్రీమింగ్ కి తీసుకురాగా ఈ సీజన్ ఒక్క దానికే 135 మిలియన్ డాలర్స్ (1,125 కోట్ల రూపాయలు) ఖర్చు చేశారట. ఈ సిరీస్ గత ఏడాది వచ్చిన హైయెస్ట్ రేటింగ్ సిరీస్ లలో కూడా ఒకటి. ఇది మొత్తం 9 ఎపిసోడ్స్ గా వచ్చింది.
టాప్ 3 – సెవెరెన్స్: సీజన్ 2 (Severance)
ఇది కూడా ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ కాగా దీనిని కూడా యాపిల్ టీవీ వారే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. “సెవెరెన్స్” (Severance) అనేది లూమోన్ ఇండస్ట్రీస్ అనే ఒక వింత కంపెనీ చుట్టూ తిరుగుతుంది. ఆఫీసు ఉద్యోగులు తమ ఆఫీసు జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేరు చేయడానికి మెదడుకు ఒక శస్త్రచికిత్స చేయించుకుంటారు. దీంతో వారికి రెండు వేర్వేరు వ్యక్తిత్వాలు ఏర్పడతాయి. ఈ వింత ప్రయోగం తర్వాత ఎలా వెళ్ళింది అనేదే ఇందులో ప్లాట్. ఇక ఈ క్రేజీ సిరీస్ ని ఏకంగా 200 మిలియన్ డాలర్స్ (సుమారు 1800 కోట్ల రూపాయలు) కి పైగా ఈ సిరీస్ కి బడ్జెట్ అయ్యిందట. మరి ఈ సీజన్ కూడా 9 ఎపిసోడ్స్ తో రాగా జనవరి 17న స్ట్రీమింగ్ కి వచ్చింది.
టాప్ 2 – స్టార్ వార్స్ అండోర్: సీజన్ 2 (Andor)
స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ కి వరల్డ్ వైడ్ గా మంచి ఫేమ్ ఉంది. మరి ఈ యూనివర్స్ నుంచి వచ్చిన సిరీస్ లలో ఒకటే ఈ ‘అండోర్’. దీని రెండో సీజన్ ని డిస్నీ హాట్ స్టార్ వారు స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. అయితే ఈ సిరీస్ కి ఏకంగా 291 మిలియన్ డాలర్స్ (2,400 కోట్ల రూపాయలకి) పైగా ఖర్చు చేశారట. దీనితో ఇది టాప్ 2 ఎక్స్ పెన్సివ్ సిరీస్ గా గత ఏడాదికి నిలిచింది. ఇది ఏప్రిల్ 22న రిలీజ్ కి వచ్చింది.
టాప్ 1 – స్ట్రేంజర్ థింగ్స్: సీజన్ 5 (Stranger Things 5)
ఇది గత ఏడాది మొత్తంలో మోస్ట్ అవైటెడ్ అండ్ వాంటెడ్ సిరీస్ అని చెప్పొచ్చు. భారీ హైప్ మధ్యలో ఈ సిరీస్ తాలూకా ఆఖరి సీజన్ ని నెట్ ఫ్లిక్స్ వారు మొత్తం 8 ఎపిసోడ్స్ గా తీసుకొచ్చి ఈ ఏడాది 1వ తేదీతో ముగించారు. అయితే ఈ సిరీస్ కి ఓటిటి హిస్టరీ లోనే ఒక షాకింగ్ బడ్జెట్ ని మేకర్స్ పెట్టారు. ఒకో ఎపిసోడ్ కి ఈజీగా 50 మిలియన్ డాలర్స్ కి పైగా బడ్జెట్ పెట్టారట. ఇలా మొత్తం 8 ఎపిసోడ్స్ కి ఏకంగా 400 నుంచి 480 మిలియన్ కి పైగా బడ్జెట్ అయ్యింది. అంటే గరిష్టంగా 4300 కోట్ల రూపాయలు కేవలం ఈ సీజన్ కోసమే ఖర్చు చేశారట.
ఇలా గత ఏడాదిలో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ వెబ్ సిరీస్ లలో ఇవి టాప్ 5గా నిలిచాయి. ఈ అన్నిటికీ దాదాపు సాలిడ్ రేటింగ్స్ ఆడియెన్స్ నుంచి రావడం విశేషం.


