రాకింగ్ స్టార్ ట్రైలర్ కు 3 కోట్ల వ్యూవ్స్ !
Published on Nov 15, 2018 3:58 am IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘కేజీఎఫ్’. ఇప్పటికే ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ అత్యధిక వ్యూవ్స్‌తో దూసుకుపోతోంది. మొత్తం ఐదు భాషల్లో కలిపి నాలుగు రోజుల్లో 3 కోట్ల వ్యూవ్స్ వచ్చాయి. ఒక్క తెలుగులోనే 6 మిలియన్ వ్యూవ్స్ సాధించింది. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న కేజీఎఫ్ సినిమా ట్రైలర్‌ మరెన్ని మిలియన్ల వ్యూవ్స్ సాధిస్తుందో చూడాలి.

లెజెండరీ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకం పై రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ‘కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)’. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను, వారాహి చలన చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తెలుగులో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

  • 32
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook