3 మిలియన్ వ్యూస్ సాధించిన సీటీమార్ “కబడ్డీ అంథెం”

Published on Aug 26, 2021 11:59 pm IST

సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్, తమన్నా భాటియా హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం సీటిమార్. ఈ చిత్రం నుండి కబడ్డీ అంతెం పాట విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాట కి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక సోషల్ మీడియా లో సైతం ఈ పాట వైరల్ గా మారింది. ఈ పాట ఒక్క రోజు లోనే యూ ట్యూబ్ లో 3 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించడం జరిగింది.

కబడ్డీ అంతెమ్ పాటకి కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి, సాయి చరణ్, రమ్య బెహరా, సాహితీ చాగంటి లు పాడారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :