“సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” వేట కొనసాగుతూనే ఉందిగా!

“సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” వేట కొనసాగుతూనే ఉందిగా!

Published on Aug 24, 2021 8:03 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ అంటూ సర్కారు వారి పాట చిత్ర యూనిట్ ఒక వీడియో ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వీడియో యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకూ ఈ వీడియో 35 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించడం జరిగింది. అంతేకాక 987కే లైక్స్ ను సొంతం చేసుకొని వన్ మిలియన్ లైక్స్ వైపు కి పరుగులు పెడుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం లో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన మొదటి సారిగా మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు