కొనసాగుతున్న పుష్ప వేట… ఫస్ట్ సింగిల్ కి ఐదు భాషల్లో 36 మిలియన్ కి పైగా వ్యూస్!

Published on Aug 22, 2021 8:46 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. అల్లు అర్జున్ ఈ చిత్రం లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం లో మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ పాత్రలో నటిస్తున్నారు. అయిదు భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం నుండి మొదటి సింగిల్ ఆగస్ట్ 13 వ తేదీన విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ పాట కి అన్ని బాషల్లో కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట ఐదు బాషల్లో ఇప్పటి వరకూ 36 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలు గా విడుదల కానున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :