4 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించిన “వరుడు కావలెను” టీజర్

Published on Sep 1, 2021 8:44 pm IST


నాగ శౌర్య హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయింది. గడిచిన 24 గంటల్లోనే ఈ టీజర్ భారీ వ్యూస్ తో యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం టీజర్ ఇప్పటి వరకూ కూడా 4.1 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించడం జరిగింది.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :