పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇద్దరు యంగ్ హీరోయిన్స్ శ్రీలీల మరియు రాశి ఖన్నా కలయికలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. ఇక ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ఫ్యాన్స్ ని అలరించాయి. ఇక నెక్స్ట్ సాంగ్ గా హరీష్ శంకర్ మొన్నామధ్య చెప్పిన పాట తాలూకా ప్రోమోని మేకర్స్ వదిలారు. అయితే ఈ ప్రోమోలో దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ మాస్ బీట్స్ తో దీనిని అందించారని చెప్పొచ్చు.
అలాగే ఈ సాంగ్ లో పవన్ డ్రెస్సింగ్, మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మరి ఈ ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. దీనికి ఈ మార్చ్ 12 వరకు ఆగాల్సిందే. అలాగే 12న సాయంత్రం 5 గంటలకి గ్రాండ్ ఈవెంట్ లో సాంగ్ ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ మార్చ్ 19న సినిమా విడుదల కాబోతుంది.


