ఆ 40మందితో భారీ యాక్షన్ క్లైమాక్స్ ప్లాన్ చేసిన రాజమౌళి.!

Published on Mar 7, 2021 11:05 pm IST

ప్రస్తుతం ఇండియన్ వైడ్ భారీ అంచనాలు సెట్ చేసుకున్న పలు పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూట్ ఇప్పుడు నిర్విరామంగా సాగుతుంది. అయితే ఇటీవలే ఈ చిత్రంలో ఒక హై ఎండ్ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేసిన రాజమౌళి దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు.

హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ తో ఈ సీక్వెన్స్ ను ప్లాన్ చేసారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఇది అనుకున్న దానికంటే మించే ఉంటుందట కేవలం ఈ సీక్వెన్స్ కోసం రాజమౌళి ఒక సరైన 40మంది అమెరికన్ ఫైటర్స్ ను రంగంలోకి దింపారట. వారితో ప్లాన్ చేసిన ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ గా ఓ రేంజ్ లో ఉంటుందట. మొత్తానికి మాత్రం రాజమౌళి అంతా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ను విట్నెస్ చెయ్యాలి అంటే వచ్చే అక్టోబర్ 13 వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :