రూల్ ఏదైనా.. నేషనల్ లెవెల్లో మోగుతున్న బన్నీ నామ స్మరణ!

రూల్ ఏదైనా.. నేషనల్ లెవెల్లో మోగుతున్న బన్నీ నామ స్మరణ!

Published on Feb 11, 2026 5:00 PM IST

Allu Arjun

మన టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ని రూల్ చేసే రేంజ్ కి ఎదిగిన హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కూడా ఒకరు. మరి ఎలాంటి రాజమౌళి బ్రాండ్ లేకుండా బన్నీ తనకున్న పాన్ ఇండియా క్రేజ్ ని తానే టెస్ట్ చేసుకొని మరీ పుష్ప 2 తో ప్రూవ్ చేసుకోవడం జరిగింది.

అయితే బన్నీ విషయంలో చాలానే తతంగం ఎప్పుడూ ఏదొక రకంగా నడుస్తూనే ఉంటుంది. అలా లేటెస్ట్ గా తన 42 రూల్స్ అంటూ ఓ పెద్ద లిస్ట్ తో సోషల్ మీడియా నిన్నటి నుంచి ఊగిపోతోంది. అయితే అలాంటివి ఏమి లేవని బన్నీ టీం క్లారిటీ ఇవ్వడం, ఇంకా అనేకమంది తన సహా నటులు కూడా చెప్పడం జరిగింది.

కానీ ఇక్క మ్యాటర్ ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతం నేషనల్ లెవెల్లో మాత్రం అల్లు అర్జున్ నామ స్మరణ ఒక్కటే ఎక్కువగా వినిపిస్తుంది అని చెప్పి తీరాలి. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా నేషనల్ మీడియాలలో సైతం బన్నీ కోసమే చర్చ నడుస్తుంది. మరి ఇదంతా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు