పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” ఫస్ట్ సింగిల్ కి 41 మిలియన్ వ్యూస్!

Published on Aug 25, 2021 7:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. పుష్ప ది రైస్ అంటూ మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడి, విడుదల కూడా వాయిదా పడటం జరిగింది. పాన్ ఇండియన్ మూవీ గా ఐదు బాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. దాక్కో దాక్కో మేక అంటూ తెలుగు తో పాటుగా మిగతా భాషల్లో కలిపి ఇప్పటి వరకూ 41 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. 1.5 మిలియన్ లైక్స్ సొంతం చేసుకోవడం జరిగింది. మొత్తానికి భారీ రెస్పాన్స్ రావడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో విలన్ పాత్ర లో ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ నటిస్తుండగా, అల్లు అర్జున్ సరసన ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది.

పాట చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :