స్వర్గీయ డా. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఫ్యామిలీ డ్రామా ‘మనం’. మే 23న విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అక్కినేని ఫ్యామిలీకి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. రేపటితో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోనుంది.
పూర్వ జన్మలకి సంబందించిన కథతో తెరకెక్కిన ఈ సినిమాని సామన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా చెప్పిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ ని అందరూ ప్రశంసించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ నిర్మించిన ఈ సినిమాలో సమంత, శ్రియ హీరోయిన్స్ గా నటించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఎ.ఎన్.ఆర్ చివరి సినిమాగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.


