భారీ రెస్పాన్స్ కొల్లగొట్టిన “సీటిమార్” ట్రైలర్!

Published on Sep 1, 2021 10:47 am IST


గోపీచంద్ హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం సీటిమార్. ఈ చిత్రం కబడ్డీ ఆట నేపథ్యం లో తెరకెక్కుతుంది. ఈ చిత్రం కి సంబంధించిన పాటలు, పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే నిన్న హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా సీటిమార్ చిత్రం ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రం ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూ ట్యూబ్ లో 6 మిలియన్ కి పైగా వ్యూస్, 150కే కి పైగా లైక్స్ దక్కించుకొని మాస్ బొమ్మ అనిపించుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :