మరో ట్రీట్‌ను రెడీ చేస్తున్న ‘ధురంధర్ 2’.. ఈ సారి మ్యూజికల్ ట్రీట్..!

మరో ట్రీట్‌ను రెడీ చేస్తున్న ‘ధురంధర్ 2’.. ఈ సారి మ్యూజికల్ ట్రీట్..!

Published on Mar 11, 2026 8:59 PM IST

Dhurandhar 2

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం పెయిడ్ ప్రివ్యూల కోసం జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ బాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. గతంలో ‘స్త్రీ 2’ పేరిట ఉన్న రికార్డులను తిరగరాస్తూ, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది ఆల్-టైమ్ రికార్డు నమోదు చేసింది. ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులలో పూనకాలు తెప్పిస్తోంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ మరియు ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పాటు, శశ్వత్ సచ్‌దేవ్ సమకూర్చిన ‘ఆరి ఆరి’ సాంగ్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. అభిమానుల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్ మేరకు, ఈ పాటను మార్చి 12న మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు ఆదిత్య ధర్ అధికారికంగా ప్రకటించాడు.

మొదటి భాగం భారీ విజయం సాధించడంలో పాటలు కీలక పాత్ర పోషించాయి. కాబట్టి ఈ సీక్వెల్‌లోని మ్యూజిక్ పై కూడా ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. జియో స్టూడియోస్ మరియు ఆదిత్య ధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు