69వ జాతీయ అవార్డులు : 6 అవార్డులు సొంతం చేసుకున్న RRR

69వ జాతీయ అవార్డులు : 6 అవార్డులు సొంతం చేసుకున్న RRR

Published on Aug 24, 2023 7:24 PM IST

RRR 2

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ మూవీ RRR. గత ఏడాది రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకోవడంతో పాటు నాటు నాటు సాంగ్ తో ఏకంగా ఆస్కార్ కూడా సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇక తాజాగా 69వ జాతీయ అవార్డుల్లో భాగంగా మొత్తం 6 క్యాటగిరిల్లో ఈ మూవీ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. కాగా అవేవో ఇప్పుడు చూద్దాం.

ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్యం} – ఎమ్ ఎమ్ కీరవాణి

ఉత్తమ కొరియోగ్రాఫర్ – ప్రేమ్ రక్షిత్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – శ్రీనివాస్ మోహన్

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫర్ – కింగ్ సాలోమన్

ఉత్తమ గాయకుడు – కాల భైరవ

ఉత్తమ ఎంటర్టైన్మెంట్ చిత్రం – నిర్మాత డివివి దానయ్య

తాజా వార్తలు