నైజాంలో మజిలీ 6రోజుల షేర్ !

Published on Apr 11, 2019 4:02 pm IST

ఇటీవల విడుదలైన మజిలీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ముఖ్యంగా ఈ చిత్రం నైజాం లో వీక్ డేస్ లో కూడా అదరగొడుతుంది. నిన్న ఈ చిత్రం నైజాం లో 70లక్షల షేర్ ను రాబట్టింది. ఇక 6రోజులకుగాను అక్కడ 7.54కోట్ల షేర్ వసూళ్లతో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం నైజాంలో 10కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

ఇక ఈ రోజు పోలింగ్ జరుగుతుండడంతో ఆంధ్రా లో ఈ చిత్రం యొక్క కలెక్షన్స్ ఫై ప్రభావం పడ్డ నైజాం లో మాత్రం సినిమా కలెక్షన్స్ కు ఎలాంటి ఆటంకం లేదు. అడ్వాన్ బుకింగ్స్ ఎక్స్ట్రార్డినరీ గా ఉన్నాయి. ఇక ఎట్టకేలకు చైతూ ఈ చిత్రం తో చాలా రోజుల తరువాత బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాడు.

సంబంధిత సమాచారం :