రీఎంట్రీ ఇవ్వనున్న ‘7/జి’ హీరో రవి కృష్ణ

Published on Apr 16, 2021 10:01 pm IST

ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్. రత్నం కుమారుడు రవి కృష్ణ హీరోగా పరిచయమైన మొదటి సినిమా ‘7/జి బృందావన్ కాలనీ’ అనూహ్య రీతిలో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ సక్సెస్ అయింది. దాంతో రవి కృష్ణ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఆ సినిమా తర్వాత రవి కృష్ణకు వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగు, తమిళంలో ఆరేడు సినిమాలు చేసినా ఏదీ హిట్ కాలేదు. దీంతో 2011 తర్వాత రవి కృష్ణ సినిమాలు చేయలేదు.

మళ్ళీ దశాబ్దం గ్యాప్ తర్వాత ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. రీఎంట్రీ కూడ మంచి స్ట్రైకింగ్ కథతో ఇవ్వాలని చూస్తున్నారట. అయితే ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది, డైరెక్టర్ ఎవరు, ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే నిర్మాత ఏ.ఎమ్. రత్నం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :