కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మంచి హిట్ అందుకోవాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తన గత రెండు సినిమాలూ నిరాశనే మిగల్చడంతో అభిమానులు నెక్స్ట్ చేస్తున్న వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ పైనే అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుండగా మేకర్స్ ఫైనల్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ కి డేట్ మరియు సమయాన్ని ఇపుడు ఖరారు చేశారు.
దీనితో రేపు మార్చ్ 2న ఉదయం 10 గంటల 8 నిమిషాలకి ఈ సినిమా తాలూకా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ రెండూ వదులుతున్నట్టు ఖరారు చేశారు. మరి ఈ సినిమా ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని మేకర్స్ ప్రామిస్ చేశారు. మెయిన్ గా సూర్య గజిని రోజులు తీసుకొస్తున్నట్టు కూడా నిర్మాత నాగవంశీ తెలిపారు. దీనితో ఈ అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


