70% బాక్సాఫీస్ వసూళ్లు ఏపీ నుంచే.. బాలయ్య క్రేజీ కామెంట్స్ !

70% బాక్సాఫీస్ వసూళ్లు ఏపీ నుంచే.. బాలయ్య క్రేజీ కామెంట్స్ !

Published on Jun 25, 2026 12:54 PM IST

బాలయ్య బాబు – కొరటాల శివ కాంబినేషన్‌లో ‘NBK 112’గా ఓ సినిమా రాబోతుంది. ఐతే, నేడు అమరావతిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు అయింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ, దాదాపు 70% బాక్సాఫీస్ వసూళ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి, మిగిలిన 30% మాత్రమే తెలంగాణ నుంచి వస్తాయని అన్నారు. సినిమా రంగానికి సంబంధించి ఆదాయంలో ఆంధ్ర ఎక్కువ వాటాను అందిస్తున్నందున, ఈ రాష్ట్రంలో మరిన్ని సినిమా షూటింగ్‌ లు, అలాగే మెరుగైన చిత్ర మౌలిక సదుపాయాలు ఉండాలని బాలయ్య అన్నారు.

చాలామంది ఇతర తెలుగు హీరోల కంటే తానే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సినిమాలు తీశానని, భవిష్యత్తులోనైనా చిత్రనిర్మాతలు తమ ప్రాజెక్టుల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంచుకుంటారని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని రూ.150కోట్ల నుంచి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభించి, 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు.

తాజా వార్తలు