సమీక్ష : “7:11పిఎమ్” – కాన్సెప్ట్ బాగున్నా కథనం బాగోదు

Published on Jul 8, 2023 3:03 am IST
7:11 PM Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 07, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సాహస్ పగడాల, దీపికా రెడ్డి, టెస్ వాల్ష్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు మరియు ఇతరులు

దర్శకుడు : చైతు మాదాల

నిర్మాతలు: నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి

సంగీతం: జ్ఞాని

సినిమాటోగ్రాఫర్‌లు: శివశంకర్, ఫాబియో కాపోడివెంటో

ఎడిటర్ : శ్రీను తోట

సంబంధిత లింక్స్: ట్రైలర్

 


ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాల్లో కాస్త అటెన్షన్ ని పట్టుకునే విధంగా డీసెంట్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన సై ఫై థ్రిల్లర్ డ్రామా “7:11పిఎమ్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఈ చిత్రం 1999 లో సెట్ చేయబడింది కాగా ఆంధ్రప్రదేశ్ హంసలదీవి ప్రాంతంలో రవి ప్రసాద్(సాహస్ పగడాల) అనే ఐపీఎస్ ఆఫీసర్ విమల(దీపికా రెడ్డి) అనే ఒకామెతో ప్రేమలో ఉంటాడు. అయితే ఇదిలా ఉండగా వారుండే ప్రాంతంలో కొన్ని ఏలియన్స్ ఓ మిషన్ నిమిత్తం ల్యాండ్ అవుతాయి. అలాగే మరో పక్క అదే ఏరియాలో రవిప్రసాద్ ఓ పెద్ద స్కామ్ ని కూడా ప్లాన్ చేస్తాడు. మరి ఆ స్కాం ఏంటి అసలు ఆ ప్రాంతాల్లో ఏలియన్స్ ఎందుకు దిగారు అలా దిగడంతో ఆ ప్రాంతంలో జరిగిన మార్పులు ఏంటి? అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

కొన్ని భారీ చిత్రాలు మంచి బడ్జెట్ అని చెప్తూ హైప్ ఇచ్చి ప్రమోషన్స్ చేసినప్పటికీ విజువల్స్ పరంగా అవేమాత్రం ఆకట్టుకోవు. కానీ కొన్ని సినిమాలు మాత్రం తక్కువ బడ్జెట్ లోనే ప్లాన్ చేసినప్పటికీ డీసెంట్ అవుట్ పుట్ తో అయితే వస్తారు. మరి అలాంటి లిస్ట్ లో అయితే ఈ “7:11పిఎమ్” చిత్రం నిలుస్తుంది అని చెప్పాలి. చాలా లిమిటెడ్ బడ్జెట్ లోనే మంచి విజువల్స్ ని అయితే మేకర్స్ చూపించడం విశేషం.

ఇక నటుడు సాహస్ పగడాల అయితే తన రోల్ లో సిన్సియర్ నటనను కనబరిచాడు. తన చుట్టూతా కనిపించే కథ కథనాలు బాగున్నాయి. అలాగే నటి దివ్య రెడ్డి కూడా మంచి నటన కనబరిచింది. అలాగే ఈ చిత్రంలో కనిపించిన టెస్ వాల్స్ అలాగే భరత్ రెడ్డి, చరణ్ కురుగొండ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. అలాగే కామెడీగా రైజింగ్ రాజు పై పలు కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇంకా వీటితో పాటుగా ఇంటర్వెల్ క్లైమాక్స్ లో సీక్వెన్స్ లు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మంచి కాన్సెప్ట్ అండ్ కొన్ని విజువల్స్ బాగానే కనిపించినా ఈ చిత్రంలో స్లో నరేషన్ అనేది మేజర్ డ్రా బ్యాక్ అని చెప్పాలి. నెమ్మదిగా నడిచే కథనం అయితే సినిమాని సాగదీతగా తీసుకెళ్తుంది అలాగే ఈ సినిమా “7:11పిఎమ్” అనేది సమయాన్ని సూచిస్తుంది పైగా సై ఫై డ్రామా ఇది కావడంతో డెఫినెట్ గా టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉండి ఉండొచ్చు అని థాట్ రావచ్చు.

ఇందులో అది కూడా ఉంది. అయితే ఇలాంటి కాన్సెప్ట్ అన్నపుడు అంశాలు చాలా లాజికల్ గా అర్ధమయ్యేలా చూపించాలి. కానీ ఈ చిత్రంలో అది బాగా మిస్ అయ్యింది. రీసెంట్ గా వచ్చిన పలు టాలీవుడ్ చిత్రాలు ఈ కాన్సెప్ట్ లో ఉన్నవే గుర్తుకొస్తాయి. సో ఇందులో పెద్ద కొత్తదనం ఏమి కనిపించదు.

కొన్ని అంశాలు బాగున్నప్పటికీ మేజర్ గా సినిమాలో నరేషన్ అంతా చాలా డల్ గానే అనిపిస్తుంది. ఇంకా ఇందులో మరీ లాజికల్ ఎర్రర్ గా అనిపించే అంశం ఏమిటంటే 1999 కాలంలో కూడా క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ బార్ కోడ్ లను చూపించడం ఏదైతే ఉంది ఇప్పుడు మనకి టైం ట్రావెల్ చేసి నిజంగా ఉందా అనిపించేంత సిల్లీగా ఉంటుంది.

 

సాంకేతిక వర్గం :

 

పైన చెప్పిన విధంగా అయితే నిర్మాణ విలువలు మాత్రం ఈ చిత్రంలో బాగున్నాయి. అందుకు నిర్మాతలను మెచ్చుకోవాలి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ మంచి ప్రోడక్ట్ ని ఐతే వారు అందివ్వలేకపోయారు. ఇక టెక్నీకల్ టీం లో సినిమాటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ సెకండాఫ్ లో బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు చైతూ మైదాల విషయానికి వస్తే..తాను డీసెంట్ కాన్సెప్ట్ ట్రై చేద్దాం అని చూసాడు కానీ అందులో సక్సెస్ కాలేకపోయాడు. చాలా లాజికల్ ఎర్రర్స్ స్లో నరేషన్ లతో అయితే సినిమా నడుస్తుంది. ఓవరాల్ గా అయితే తన వర్క్ మాత్రమ్ మెప్పించదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “7:11పిఎమ్” చిత్రం రొటీన్ కాన్సెప్ట్ ని కొత్తగా ఏమన్నా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అది లాజికల్ ఎర్రర్స్ తో అయితే సక్సెస్ కాలేదు. కొన్ని అంశాలు నిర్మాణ విలువలు బాగుంటాయి మినహా ఈ సై ఫై డ్రామా అయితే అంతగా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :